పాకిస్తాన్‌కు చెందిన ‘కోక్’ స్టూడియో పాటలు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటివరకూ ‘పసూరి’ పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. అలాగే, ‘ఆఫ్రీన్ ఆఫ్రీన్’ పాటకూడా ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటను రహత్ ఫతే అలీ ఖాన్, మోమినా ముస్తేసన్ పాడారు. ఈ పాటకు యూట్యూబ్‌లో 360 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. కాగా, ఈ పాటను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ విక్రంజీత్‌సింగ్ అద్భుతంగా పాడారు. ఆ గొంతుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోను ‘సుమిత్ చౌదరి’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. 1.37 నిమిషాల ఈ క్లిప్‌లో విక్రంజీత్‌సింగ్ మరో కానిస్టేబుల్ గిటార్ వాయిస్తుండగా తన అద్భుతమైన గాత్రంతో ఆఫ్రిన్ ఆఫ్రిన్ పాటను ఆలపించాడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. విక్రంజీత్‌సింగ్ పాట నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ‘విక్రంజీత్‌సింగ్ చాలా చక్కగా పాడుతున్నాడు.. ఇండియన్ ఐడల్‌లో ఉండాల్సిన వ్యక్తి’ అని కామెంట్ చేశారు.
With this #Lovely weather,#DelhiRains #Enjoy this lovely song
Afreen afreen…
By @ITBP_official Constable Vikram Jeet Singh along with him Constable A Neli strums the Guitar.@nwftr_itbp pic.twitter.com/M0iv8wVVcj
— Sumit Chaudhary (@SumitDefence) June 30, 2022