టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) నటిస్తున్న తాజా చిత్రం ఒకటి భళా తందనాన (Bhala Thandhanana) చైతన్య దంతులూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2022 మే 6న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మూవీ లవర్స్ కు మరో అదిరిపోయే అప్ డేట్ అందించారు. రేపు ఉదయం 10:40 గంటలకు గ్రీన్ టీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ఈ మాస్ బీట్‌కు డ్యాన్స్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు.
ఈ మూవీని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజిని కొర్రపాటి నిర్మిస్తున్నారు. క్యాథరీన్ థ్రెస్సా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి, సత్య, కేజీఎఫ్ ఫేం రామచంద్రరాజు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ-మాటలు అందిస్తుండగా..మార్తాండ్ కే వెంకటేష్..ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Read Also : Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు