ముంబై: బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కి కరోనా వైరస్ సోకింది. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన హోమ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన డిశ్పాచ్ సినిమాలో నటిస్తున్నారు. మనోజ్ బాయ్పాయ్తోపాటు డిశ్పాచ్ సినిమా దర్శకుడు కనూ బెహెల్కు కూడా కరోనా సోకింది. సినిమా దర్శకుడు, కీలక నటుడు ఇద్దరూ వైరస్ బారినపడటంతో డిశ్పాచ్ షూటింగ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. కాగా, క్రైమ్ జర్నలిజం నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా డిశ్పాచ్ అని ఆ చిత్ర యూనిట్ వెల్లడించింది.