e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News బాలుడిపై లైంగిక దాడి, హ‌త్య కేసులో దోషికి జీవిత‌ఖైదు

బాలుడిపై లైంగిక దాడి, హ‌త్య కేసులో దోషికి జీవిత‌ఖైదు

బాలుడిపై లైంగిక దాడి, హ‌త్య కేసులో దోషికి జీవిత‌ఖైదు

హైద‌రాబాద్ : ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడి, హ‌త్య కేసులో దోషికి రంగారెడ్డి కోర్టు జీవిత‌ఖైదు విధించింది. దోషి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ‌లం జ‌ల్‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఒమ‌ర్ బిన్‌(25). కూలీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. గుట్కా, గంజాయి త‌దిత‌ర చెడు వ్య‌వ‌స‌నాల‌కు బానిస అయ్యాడు. ఒమ‌ర్ బిన్ 2019 మే 8న ఓ బాలుడిని అప‌హ‌రించాడు. చాక్‌లెట్లు ఇప్పిస్తాన‌ని న‌మ్మించి కాంపౌండ్ వాల్‌తో కూడి ఉన్న ప్ర‌దేశానికి తీసుకువెళ్లాడు. అక్క‌డ బాలుడిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాలుడు ఏడుస్తూ అరుస్తుండ‌టంతో ఆగ్ర‌హానికి గురైన ఒమ‌ర్ బాలుడి త‌ల‌ను నేల‌కేసి ప‌లుమార్లు బాదాడు. దీంతో బాలుడి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు.

అరుపులు విన్న స్థానికులు సెల్‌ఫోన్ లైట్ల సాయంతో ప్ర‌దేశానికి వెళ్లి చూడ‌గా ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్న బాలుడి మృత‌దేహం క‌నిపించింది. ఓ ప‌క్క‌గా న‌క్కిన నిందితుడిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా పారిపోయాడు. బాధితు కుటుంబ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. కోర్టు విచార‌ణ‌లో పోలీసులు సాక్ష్యాలు, ఆధారాలు స‌మ‌ర్పించడంతో న్యాయ‌స్థానం ఒమ‌ర్ బిన్‌కు జీవిత‌ఖైదుతో పాటు రూ.7 వేలు జరిమానాగా విధిస్తూ తీర్పును వెలువ‌రించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాలుడిపై లైంగిక దాడి, హ‌త్య కేసులో దోషికి జీవిత‌ఖైదు
బాలుడిపై లైంగిక దాడి, హ‌త్య కేసులో దోషికి జీవిత‌ఖైదు
బాలుడిపై లైంగిక దాడి, హ‌త్య కేసులో దోషికి జీవిత‌ఖైదు

ట్రెండింగ్‌

Advertisement