e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News సాగునీటి ప్రాజెక్ట్ ప‌నుల్లో వేగం పెంచాలి : మంత్రి అల్లోల

సాగునీటి ప్రాజెక్ట్ ప‌నుల్లో వేగం పెంచాలి : మంత్రి అల్లోల

సాగునీటి ప్రాజెక్ట్ ప‌నుల్లో వేగం పెంచాలి :  మంత్రి అల్లోల

హైద‌రాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నీటిపారుద‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్ట్ ప‌నుల ప్రగతిపై పలువురు ఎమ్మెల్యేలు, జ‌డ్పీ చైర్ ప‌ర్సన్లు, జ‌డ్పీ చైర్మన్‌, నీటిపారుద శాఖ ఉన్నతాధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వహించారు.
చ‌నాక‌- కొరాట, లోయ‌ర్ పెన్ గంగా, ప్రాణ‌హిత‌, నీల్వాయి, జ‌గ‌న్నాథ‌పూర్, కుమ్రం భీం, కుఫ్టీ ప్రాజెక్ట్ లు, చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేష‌న్, ప్యాకేజీ 27 & 28, స‌ద‌ర్మాట్ బ్యారేజీ, క‌డెం ప్రాజెక్ట్ ప‌నులు, చెక్ డ్యాం నిర్మాణాల‌పై ఈ స‌మావేశంలో స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. జిల్లాలోని ‌ ప్రాజెక్ట్ లు, చెక్ డ్యాంలు, పంపుహౌజులు, లిఫ్టులు, కాల్వల నిర్మాణ పురోగ‌తిని అధికారులు వెల్లడించారు. తమ నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు స‌మావేశంలో వివరించారు.

కొన్ని చోట్ల ఏజెన్సీలు ప‌నులు నిలిపి వేశార‌ని ప్రజాప్రతినిధులు చెప్పడంతో.. అవసరమైతే పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న పాత కాంట్రాక్టు సంస్థలను తొలగించి, వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని సూచించారు. చివ‌రి ఆయ‌క‌ట్టుకుకు నీరందించాల‌న్న లక్ష్యంతో ప‌ని చేసి ప్రాజెక్ట్ లను పూర్తిగా సద్వినియోగంలోకి తేవాలని మంత్రి తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్ ల‌పై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించార‌ని, పెడింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ల‌పై కూలంకశంగా చర్చించి స‌మ‌గ్ర వివరాల‌ను అందించాల‌ని అధికారులను ఆదేశించారు. స‌మీక్షలో ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, దివాక‌ర్ రావు, విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం స‌క్కు‌, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌, జిల్లా జ‌డ్పీ చైర్ పర్సన్‌లు కోవా ల‌క్ష్మి, విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, ఓదెలు భాగ్యలక్ష్మి, జ‌డ్పీ చైర్మన్‌ రాథోడ్ జ‌నార్దన్‌, డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్, నీటి పారుద‌ల శాఖ సీఈలు శ్రీనివాస్ రెడ్డి, రమేష్, ఎస్లు, ఈఈ లు, ఇత‌ర అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాగునీటి ప్రాజెక్ట్ ప‌నుల్లో వేగం పెంచాలి :  మంత్రి అల్లోల

ట్రెండింగ్‌

Advertisement