న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వచ్చే 12 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలు ఊపందుకోనున్నాయి. మనదేశంతో సహా వివిధ దేశాల్లోని వాహనాల వినియోగదారుల్లో 90 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడానికి ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం ఎర్నెస్ట్ అండ్ యంగెస్ట్ (ఈవై) అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఈవై సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది.. ఎలక్ట్రిక్ వాహన ధరలో 20 శాతం ప్రీమియం చెల్లించేందుకు సిద్ధం అని సంకేతాలిచ్చారు. ఇండియన్లలో ఒకసారి చార్జింగ్ చేసిన ఎలక్ట్రిక్ వాహనం 100-200 మైళ్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండాలని కోరారు.
సుమారు 90 శాతం మంది ఇండియన్లు ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుగోలు చేయడానికి ప్రీమియం చెల్లించడానికి సిద్ధం అని పేర్కొన్నారు. వారిలో 40 శాతం మంది సదరు ప్రీమియం 20 శాతం వరకైనా చెల్లించేందుకు రెడీ అని సంకేతాలిచ్చారు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న మోడల్ కార్ల కంటే డిజిటల్ చానెల్స్ ఉన్న కార్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల 97 శాతం మందిలో పర్యావరణం పట్ల అవగాహన పెరిగింది.
67 శాతం మంది ఒక విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేసి తమ వంతుగా వ్యక్తిగతంగా పర్యావరణ పరిరక్షణకు ముందుకు వస్తున్నారు. 69 శాతం మంది ఈ లక్ష్య సాధనకు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయడం ఒక్కటే మార్గం అని తేల్చేశారు.
ఇప్పటికే విద్యుత్ వాహనం కలిగి ఉన్న వారు.. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాహనాలు గంటలోపే పూర్తిగా చార్జింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలని అభిప్రాయ పడుతున్నారు. 45 శాతం మంది కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈవై ఇండియా పార్టనర్ అండ్ ఆటోమోటివ్ సెక్టార్ లీడర్ వినయ్ రఘునాథ్ స్పందిస్తూ.. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి కన్జూమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఇందుకోసం అవసరమైతే అదనంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఈవై మొబిలిటీ కన్జూమర్ ఇండెక్స్ (ఎంసీఐ) ప్రకారం మనదేశంలో వెయ్యి మందితోపాటు మొత్తం 13 దేశాల్లోని తొమ్మిది వేల మంది పై చిలుకు వాహన వినియోగదారులతో సర్వే జరిపింది. ఈ నెల మూడోవారంలో ఈ అధ్యయనం జరిగింది.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్‌కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్‌లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్‌కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?