Abhishek Singh IAS | అభిషేక్ సింగ్.. గ్లామర్‌లో సినీతారలకు తగ్గడు. శరీర సౌష్ఠవంలో మోడల్స్‌కు దీటుగా ఉంటాడు. విషయ పరిజ్ఞానంలో గూగుల్ సెర్చింజిన్‌తో సమానం. కాబట్టే.. ఓటీటీలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటూ, ర్యాంప్‌ల మీద మోడల్‌గా దర్పం ఒలకబోస్తూ, కలెక్టర్ స్థాయి అధికారిగా ఢిల్లీ సచివాలయంలో కీలక హోదాలో ఉన్నాడు.
ఆయన ర్యాంప్ మీద నడుస్తుంటే.. పక్కా ప్రొఫెషనల్ మోడల్. కెమెరా ముందు నిలబడితే. ఇంకో టేక్ అవసరం లేని నటుడు. సచివాలయంలో అడుగుపెడితే మాత్రం.. కీలకమైన ఫైళ్లతో కుస్తీపట్టే ఐఏఎస్ అధికారి. అభిషేక్ సింగ్ తండ్రి ఉత్తరప్రదేశ్ స్టేట్ పోలీస్ సర్వీస్‌లో పనిచేశాడు. ఆయన ప్రభావం వల్లే చిన్నప్పటి నుంచీ ఐఏఎస్ సాధించాలని కలలు కన్నాడు అభిషేక్. ఆయన భార్య దుర్గాశక్తి నాగపాల్ కూడా ఐఏఎస్ అధికారే. యమునా నగర్ ఇసుక అక్రమ రవాణా కుంభకోణం వ్యవహారంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నది.
అభిషేక్ సింగ్ 2011లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే తనకు కాస్ట్యూమ్ డైరెక్టర్‌గా పనిచేసే ముఖేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ముంబై వెళ్లినప్పుడు ముఖేశ్ ఇంటికెళ్లాడు. ఆ సమయానికి ‘ఢిల్లీ క్రైమ్ సీజన్- 2’కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ బృందంతో మాట్లాడుతున్నాడు ముఖేశ్. ఆ నిలువెత్తు పర్సనాలిటీని చూసి అభిషేక్‌ను కూడా నటుడనే అనుకున్నారు వాళ్లు. ‘మీరు ఇంతకుముందు ఏ ప్రాజెక్టులో చేశారు?’ అని అడిగారు. తన నేపథ్యం తెలిశాక.. ‘ఈ సిరీస్‌లో ఐఏఎస్ అధికారి పాత్ర ఒకటి ఉంది. మీరు తప్పకుండా చేయాల్సిందే’ అని మొహమాట పెట్టారు. కాదనలేకపోయాడు. ‘ఢిల్లీ క్రైమ్-2’ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.
ఓటీటీలతోపాటు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ చేశాడు. ‘దిల్ తోడ్‌కే’ అయితే యూట్యూబ్‌లో 23 కోట్ల 50 లక్షల వ్యూస్ సాధించింది. దీంతో అభిషేక్ సింగ్ మరింత పాపులర్ అయ్యాడు. ఇది ఓ యువకుడి ప్రేమ వైఫల్యానికి సంబంధించిన ఇతివృత్తం. అభిషేక్ సింగ్ కూడా ఓ విఫల ప్రేమికుడే. కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పార్కులకూ సినిమాలకూ తిరిగారు. అంతలోనే ఆమె మనసు మార్చుకుంది. దీంతో అభిషేక్ గుండె పగిలింది. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అంతలోనే జీవితం విలువ తెలిసొచ్చింది. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఐఏఎస్ కొట్టాడు. తాజాగా ఢిల్లీలో జరిగిన ‘ఫ్యాషన్ వీక్- 2022’లో ర్యాంప్ ఎక్కి వార్తల్లో నిలిచాడు. మనీశ్ మల్హోత్రా రూపొందించిన దుస్తులతో రాజసం ప్రదర్శించాడు.
కొవిడ్ మహమ్మారి సమయంలో ఈ అధికారి పరిపూర్ణ సమాజ సేవకుడిగా మారాడు. రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాడు. ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్నవారి అవసరాలు తీర్చాడు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ తనవంతు పాత్ర పోషించాడు. ఇతర రంగాల నుంచి వచ్చినవాళ్లు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ, ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుంటే, ఎంత కష్టమైనా అధిగమించవచ్చని చెప్పడానికి అభిషేక్ సింగ్ విజయమే ఓ ఉదాహరణ. సోషల్ మీడియాలో అభిషేక్ తనను తాను పరిచయం చేసుకున్న తీరు కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.. డిప్యూటీ కమిషనర్, లిబరల్ థింకర్, డ్రీమర్, ఆప్టిమిస్ట్.
“అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?”
“రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా”
రతన్ టాటా భుజాలపై చేయి వేసి మరీ మాట్లాడగలిగే ఈ వ్యక్తి గురించి తెలుసా”