AB de Villiers | మిస్టర్ 360గా పేరొందిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు తెలుపుతున్నట్లు ప్రకటించాడు. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ ఆటగాడు.. ఐపీఎల్ వంటి లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇకపై వీటిలో కూడా డివిల్లీర్స్ కనిపించడు.
ఈ క్రమంలో ఐపీఎల్లో అతని ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక వీడియో పోస్టు చేసింది. దీనిలో మాట్లాడుతున్న డివిల్లీర్స్.. కొంతకాలంగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే ఇకపై కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
అలాగే తను జీవితాంతం ఆర్సీబీ మద్దతుదారుగానే ఉంటానని డివిల్లీర్స్ స్పష్టం చేశాడు. ‘జీవితాంతం ఆర్సీబీయన్గానే ఉంటా. ఆర్సీబీ సెటప్‌లోని ప్రతి వ్యక్తి నాకు కుటుంబమే. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆర్సీబీలో వారు మిగిల్చిన స్ఫూర్తి, ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటాయి. నేనిప్పుడు సగం భారతీయుడినైపోయా. అలా అయినందుకు చాలా గర్విస్తున్నా’ అంటూ డివిల్లీర్స్ వెల్లడించాడు.