బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ తన అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అమీర్‌ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేయగా ఆన్లైన్ లో హల్చల్ చేస్తోంది. కోయి జానే నా చిత్రం నుంచి హర్ ఫన్ మౌలా వీడియో సాంగ్ ను నేడు లాంఛ్ చేశారు. అమీర్‌ఖాన్ స్నేహితుడు అమీన్ హజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అమీన్హజీకి ఇది తొలి సినిమా కావడంతో అమీర్‌ఖాన్ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
ఎల్లీ ఎవ్రామ్ ఈ పాట షూటింగ్ కోసం 5 రోజులు కేటాయించడం విశేషం. అమీర్‌ఖాన్ బిజీ షెడ్యూల్ లో ఉన్నా తన స్నేహితుడి కోసం పాటలో కనిపించి ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత అమీర్‌ఖాన్ తనలోని డ్యాన్సింగ్ స్టైల్ తో అదరగొడుతున్నాడు. ఎల్లీ-అమీర్ ఖాన్ మధ్య వచ్చే రొమాంటిక్ డ్యాన్స్ ను థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం ఖాయమని వీడియో సాంగ్ చూస్తే అర్థమవుతుంది. అమీన్ హజీ, అమీర్ గతంలో లగాన్ మంగళ్ పాండే..ది రైజింగ్ చిత్రాలకు కలిసి పనిచేశారు.
ఈ సందర్భంగా అమీర్‌ఖాన్ మాట్లాడుతూ..స్నేహితుడు అమీన్ హజీ లగాన్ టైం నుంచి నా ప్రయాణంలో ఉన్నాడు. భూషణ్, టీ సిరీస్, అమీన్‌కు కోయి జానే నా చిత్రం విజయం సాధించాలని ఆశిస్తున్నా..ఆల్ ది బెస్ట్. ఈ పాట షూటింగ్ ను చాలా బాగా ఎంజాయ్ చేశా. ఎల్లీ నా డ్యాన్స్‌లోని లోపాలను దాచిపెట్టింది. మీ అందరికీ పాట నచ్చుతుందని ఆశిస్తున్నానని అమీర్‌ఖాన్ పోస్ట్ లో పేర్కొన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.