బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన విషయం తెలుసు కదా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలను అతడు మూసేశాడు. తన సినిమాలపై సమాచారం ఆయా ప్రొడక్షన్ హౌజ్ అధికారిక వెబ్సైట్లలోనే చూడొచ్చని కూడా ఈ సందర్భంగా ఆమిర్ చెప్పాడు. అయితే అతడు సడెన్‌గా సోషల్ మీడియాకు ఎందుకు గుడ్‌బై చెప్పాడో చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఆమిరే దీనిపై స్పందించాడు. మంగళవారం కోయి జానె నా మూవీ స్క్రీనింగ్‌కు వచ్చిన ఆమిర్‌ను మీడియా ఇదే ప్రశ్న అడిగింది. దీనిపై స్పందించిన ఆమిర్.. మీరు ఏవేవో థియరీలు ఊహించుకోకండి. నేను ఎలాగూ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండను. అంతేకాకుండా ఈ మధ్య మీ మీడియానే ఎక్కువైంది. నేను అభిమానులతో మాట్లాడాలి అనుకుంటే మీ ద్వారానే మాట్లాడతాను. అది మీకు కూడా మంచిదే కదా. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతాను అని ఆమిర్ ఖాన్ అనడం విశేషం.