వాషింగ్టన్, సెప్టెంబర్ 26: కరెంట్ అవసరంలేకుండా ఆహార పదార్థాలను నిల్వచేసే సరికొత్త శీతలీకరణ యంత్రాన్ని అమెరికాలో మసాచూసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు.
ఇది భవనాల్లో ఎయిర్ కండిషనర్స్కు ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది. ఇది భాష్పీభవనం, రేడియేషన్ మీద ఆధారపడి పనిచేస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద 9.3 డిగ్రీసెల్సియస్ (19 డిగ్రీల ఫారన్హీట్) వరకు శీతలీకరణను అందిస్తుంది. అత్యంత తేమతో కూడిన పరిస్థితుల్లోనూ 40శాతం వరకు ఎక్కువ సమయంపాటు ఆహారపదార్థాలను నిల్వ ఉండేలా చూస్తుంది.