రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వాళ్లవి ! ఒక్కపూట అన్నం కోసం తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి కష్టపడే జీవితాలు అవి !! అలాంటి బతుకులకు ఉదాహరణే ఈ ఫొటో !! పొట్టకూటి కోసం చేస్తున్న పనిలో భాగంగా ఇలా కరెంట్ స్తంభంపైకి ఎక్కిన ఓ విద్యుత్ కార్మికుడు ఎలాంటి జంకు లేకుండా మరమ్మతులు చేస్తున్నాడు. హైదరాబాద్లోని డబీర్పూరా ప్రాంతంలో గురువారం కనిపించిందీ దృశ్యం.