వాషింగ్టన్: ఒత్తిడి.. మనిషి జీవితంలో పలు ప్రతికూల ప్రభావాలకు, పరిణామాలకు మూలమని అంటుంటారు. అయితే కొద్దిపాటి ఒత్తిడి మెదడు పనితీరుకు మంచిదేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి ఒత్తిడి కొన్ని పరిస్థితుల్లో మన పని జ్ఞాపకశక్తి(వర్కింగ్ మెమొరీ)కి ప్రయోజనం చేకూరుస్తుందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అయితే తీవ్రమైన ఒత్తిడి అనర్థమని, విషంతో సమానమని వారు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పలువురి ఒత్తిడి స్థాయిలు, వారి మెదడుల పనితీరును పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వర్కింగ్ మెమొరీ అనేది నిరిష్ట పనులను నిర్వహించేందుకు తక్కువ మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేస్తుంది.