salt financial planning app | ఉప్పులేని కూర అసలు కూరే కాదు. ‘సాల్ట్’ తోడులేని పొదుపు కూడా పొదుపే కాదంటున్నారు ముగ్గురు మహిళలు. సాల్ట్.. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ యాప్. దీని రూపకర్తలు.. శింజినీ కుమార్, చైత్ర చిదానంద్, అదితి షోలాపూర్కర్. చాలామంది మహిళలకు డబ్బు ఆదా గురించి తెలియదు. బంగారాన్ని పెట్టుబడిగా ఎలా మార్చాలో కూడా తెలియదు. వీటికితోడు అర్థంలేని వ్యయాలు. ఈ యాప్ ద్వారా ఖర్చు, పొదుపు, పెట్టుబడి సూత్రాలు నేర్పిస్తారు. ఎక్కడ ఖర్చు చేయాలి? ఎక్కడ తగ్గాలి? రుణాలు ఎలా తిరిగి చెల్లించాలి? అన్నదీ చెబుతారు. ప్రతి ఆర్థిక నిర్ణయంలోనూ గైడ్ చేస్తారు. ఈ ముగ్గురిలో శింజినీ కుమార్ గతంలో పేటీఎం సీఈఓగా, సిటీబ్యాంక్ బిజినెస్ మేనేజర్‌గా పనిచేశారు. మహిళల ఆర్థిక అవసరాలకు సంబంధించి ‘వన్‌స్టాప్ మనీ సిస్టమ్’గా ఈ యాప్‌ను రూపొందించామని చెప్పారు ఆ ముగ్గురూ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..