హైదరాబాద్, జూన్,5 : 91స్ప్రింగ్‌బోర్డ్ భారతదేశ మార్గదర్శక సహోద్యోగ సంఘం, ‘స్టార్టప్ స్ప్రింట్’ ప్రారంభించడానికి గూగుల్ ఫర్ స్టార్టప్స్ తో భాగస్వామ్యం చేసుకున్నది. ఈ వర్చువల్ ప్రోగ్రామ్ ఆధునిక డిజిటల్ బిజినెస్ టూల్స్ ను నేర్చుకోవడంలో సహాయపడటం ద్వారా భారతదేశంలోని వివిధ స్టార్టప్‌లకు ,వ్యాపారవేత్తలకు ఆన్లైన్లో వారి వ్యాపారాలను విస్తరించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. డిజిటల్ ఎకానమీ వృద్ధితో మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా స్టార్టప్‌లకు సహాయపడడానికి ఈ ఇన్షియేటివ్ ఎంతగానో ఉపకరించనున్నది.
వ్యాపారవేత్తలు ,ఆధునిక స్టార్టప్‌లు స్టార్టప్ స్ప్రింట్ ద్వారా, వివిధనాలెడ్జ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లను,నూతనసాంకేతికనైపుణ్యాలను,మార్గదర్శకత్వాన్ని పొందనున్నాయి. అంతేకాదు ఇది వారి వ్యాపారాలను క్రమబద్ధీకరించడానికి, క్రొత్త ప్రణాళికలను రూపొందించడానికి,డిజిటల్ టూల్స్, చానెల్లను ఉపయోగించి అభివృద్ధి చెందుతున్న కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.ఇది 18 జూన్ నుంచి ప్రారంభం కానున్నది.
ఇందులో భాగంగా స్టార్టప్‌ల కొరకు 91స్ప్రింగ్‌బోర్డ్, గూగుల్ సహకారంతో ఎంచుకున్న పరిశ్రమ నిపుణుల ద్వారా వర్క్‌షాప్‌లు, రౌండ్‌టేబుల్ సమావేశాలు,ఇంటరాక్టివ్ సెషన్ల ను నిర్వహిస్తుంది.’ మా యువ వ్యాపారవేత్తలు,కొత్త వ్యాపార వర్గాల కోసం భారతదేశంలో స్టార్టప్ స్ప్రింట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. 91స్ప్రింగ్‌బోర్డ్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో సమృద్దిగా వున్న అవకాశాల ద్వారా వృద్ధిని పెంపొందించవచ్చని ‘ 91స్ప్రింగ్‌బోర్డ్ సీఈఓ ఆనంద్ వేమూరి అన్నారు. స్టార్టప్‌ల కోసం గూగుల్‌తో ఈ భాగస్వామ్యం స్టార్టప్‌ల వ్యాపారాలు డిజిటల్లోకి మారడం ద్వారా వారి కార్యకలాపాలను అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు : http://bit.ly/gfsstartupsprint సందర్శించవచ్చు.