న్యూయార్క్, ఏప్రిల్ 3: అమెరికాలో కాలిఫోర్నియాలోని డౌన్టౌన్ సాక్రమెంటో నగరంలో ఆదివారం ఉదయం దుండగుల కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. 9 మందికి గాయాలయ్యాయి. డల్లాస్లో ఓ మ్యూజిక్ ఈవెంట్ వద్ద జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా, 10 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మెక్సికోలోని అకాపుల్కో రిసార్టు వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఓ రెస్టారెంట్ వద్ద కాల్పులు జరిగాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పారిపోతున్న ఓ దుండగుడిని వెంటాడి మట్టుబెట్టారు.