e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News వీర మ‌హిళ‌: ఎనిమిది ఫీట్ల పొడ‌వైన కింగ్‌ కోబ్రాను ర‌క్షించింది

వీర మ‌హిళ‌: ఎనిమిది ఫీట్ల పొడ‌వైన కింగ్‌ కోబ్రాను ర‌క్షించింది

వీర మ‌హిళ‌: ఎనిమిది ఫీట్ల పొడ‌వైన కింగ్‌ కోబ్రాను ర‌క్షించింది

భువ‌నేశ్వ‌ర్‌: మ‌నం చిన్న‌పామును చూస్తేనే గ‌జ‌గ‌జా వ‌ణికిపోతాం. కానీ ఓ మ‌హిళ ఎనిమిది ఫీట్ల పొడువున్న కింగ్ కోబ్రాను ప‌ట్టుకొని, ఫారెస్ట్ అధికారుల‌కు అప్ప‌గించింది. అంద‌రిచేత మ‌న్న‌న‌లు పొందింది. ఆమె కింగ్ కోబ్రాను తోక‌తో ప‌ట్టుకుంటుండ‌గా తీసిన ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అంద‌రూ ఆమెను వీర మ‌హిళ అంటూ పొగిడేస్తున్నారు.
ఒడిశాలోని మయూరభంజ్‌లో ఈ ఘ‌టన జ‌రిగింది. స‌స్మిత‌ గోచాయిత్ అనే మ‌హిళ ఇంట్లోకి ఎనిమిది ఫీట్ల పొడ‌వైన కింగ్‌ కోబ్రా వ‌చ్చింది. ఆమె రెండేళ్ల కొడుకు వైపుగా పాము వ‌స్తుండ‌డాన్ని గ‌మ‌నించిన ఆమె భ‌ర్త వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. బాలుడిని అక్క‌డినుంచి ప‌క్క‌కు లాగాడు. కాగా, స‌స్మిత‌ గోచాయిత్ భ‌య‌ప‌డ‌కుండా పామును ప‌ట్టుకుంది. కృష్ణ గోచాయిత్ అనే రేంజ్ ఆఫీస‌ర్‌ను పిలిచి పామును అప్ప‌గించారు. ఆమె పామును ప‌ట్టుకుంటుండ‌గా తీసిన ఫొటో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అంద‌రూ ఆమె ధైర్యాన్ని ప్ర‌శంసిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వీర మ‌హిళ‌: ఎనిమిది ఫీట్ల పొడ‌వైన కింగ్‌ కోబ్రాను ర‌క్షించింది

ట్రెండింగ్‌

Advertisement