కాలిఫోర్నియా: కాలిఫోర్నియా ఫైర్ సర్వీసు వారు తమకు తాజాగా వచ్చిన ఫిర్యాదు చూసి అవాక్కయ్యారు. నిజానికి ఫైర్ సర్వీసు అంటేనే ఎప్పుడు ఏ తంటా వచ్చిపడుతుందో అని ఎదురు చూడాల్సిన ఉద్యోగం. మంటలను ఆర్పడం, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయ చర్యలు చేపట్టడం షరా మామూలే. కానీ ఒక పొగగొట్టం లోనుంచి పిట్టలను బైటపడేయాల్సి రావడం అరుదైన విషయమే. ఓ ఇంటి యజమాని తమ ఇంటి పొగగొట్టంలో పిట్టలు చిక్కుకున్నాయని సమాచారం అందించాడు. పైర్ సిబ్బంది వెళ్లి చూశారు. వెయ్యిదాకా స్విఫ్ట్ జాతి పిట్టలు ఫైర్ ప్లేస్ చిమ్నీలో చిక్కుకుని ఉన్నాయి. అవే పోతాయిలే అని వెళ్లిపోయి మరుసటి రోజు వచ్చి చూస్తే అవి ఇంకా అక్కడే వేలాడుతూ కనిపించాయి. దాంతో ఇక లాభం లేదనుకుని వెనుక గది గోడకు రంధ్రం చేసి వాటిని బయటకు పంపాల్సి వచ్చింది. పిట్టలను కాపాడినందుకు అందరూ ఫైర్ సిబ్బందిని అభినందించారు.
https://www.instagram.com/p/COJchzTFUeS/