బెర్లిన్: భూమి గుండ్రంగా ఉంటుందని, సూర్యుడు చుట్టూ తిరుగుతుందని చదువుకున్నాం. అయితే, భూమి గోళాకారంగా ఉన్నట్టు రుజువుచేసే మొట్టమొదటి ఫొటోను ఎప్పుడు తీశారో తెలుసా? సరిగ్గా 75 ఏండ్ల క్రితం. నిజం. జర్మనీకి చెందిన నాజీ రాకెట్ (వీ-2) భూమికి 105 కిలోమీటర్ల ఎత్తు పై నుంచి అక్టోబర్ 24, 1946లో భూమి బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని తీసింది. రోదసిలో నుంచి భూమి ఫొటోను తీయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ దాదాపు 9 లక్షలకు పైగా భూగ్రహ చిత్రాలు తీసినప్పటికీ.. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని తీయడం సంచలనమే కదూ.