Bank Holidays | మరో ఎనిమిది రోజుల్లో 2021 కాలగర్భంలో కలిసిపోనున్నది. నూతన సంవత్సరం రాబోతున్నది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో నూతన వసంతాన్ని ఆహ్వానించేందుకు సన్నద్ధం అవుతున్నారు. కుటుంబ సభ్యులు.. బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సర వేడుకకు రెడీ అవుతున్నారు. అయితే.. ఏదైనా మనీతోనే కదా.. మనీ కావాలంటే బ్యాంకులకెళ్లాలి.. 2021లో మిగిలిన 9 రోజుల్లో ఆరు రోజులూ ఆ బ్యాంకులకు సెలవులే.
ఈ నెలలో ఒక్క నేషనల్ హాలీడే మాత్రమే వచ్చింది. అదీ క్రిస్మస్.. ఈ పండుగ సందర్భంగా దేశమంతా బ్యాంకులన్నింటికీ సెలవు. బ్యాంకుల సెలవులను ఆర్బీఐ ప్రతి ఏటా నోటిఫై చేస్తుంది. దీని ప్రకారం డిసెంబర్లో వేర్వేరు రాష్ట్రాల్లో ఏడు సెలవులు ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులకు కూడాఈ నిబంధన వర్తిస్తుంది.
శనివారం బ్యాంకులకు నాలుగో శనివారం కూడా. ఇప్పటికే బ్యాంకులకు ఈ నెల 25 నోటిఫైడ్ హాలీడేగా ఖరారు చేశారు. 6 వారాంతపు సెలవులు.. ఏడు సెలవులు కలిపి మొత్తం 12 రోజులు హాలీడేస్ వచ్చాయి. క్రిస్మస్ నాలుగో శనివారంతో కలిసిపోయింది. తొలి 20 రోజుల్లో ఆరు సెలవులు గడిచిపోయాయి. చివరి పది రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో 6 రోజులు సెలవులు వచ్చాయి.. అవేంటో చూద్దాం..