వాషింగ్టన్, అక్టోబర్ 17: అమెరికాలోని ఆరిజోనాలో బాల భీముడు జన్మించాడు. పుట్టుకతోనే 6.3 కిలోల బరువు, 23.75 అంగుళాల పొడవున్న ఈ పసివాడికి బట్టలు వేయడానికి అతని కుటుంబ సభ్యులు ఆపసోపాలు పడ్డారు. తొమ్మిది నెలల పిల్లలకు వచ్చే బట్టలు వేస్తేగానీ ఆ బుడ్డోడికి అవి సరిపోలేదు మరి. ఇప్పటికే తనకు పలుమార్లు గర్భస్రావమైందని, చివరకు ఈ చిన్నారి పుట్టడం తన అదృష్టమని బాల భీముడి తల్లి కేరీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతడి ఫొటోలు వైరల్గా మారాయి.