న్యూయార్క్ : కొడుకు మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను పెండ్లి చేసుకున్న 51 ఏండ్ల వ్యక్తి ఉదంతం అమెరికాలోని ఒహియోలో వెలుగుచూసింది. వీరిద్దరి మధ్య ఏకంగా 24 ఏండ్ల వయసు తేడా ఉండటంతో అందరూ విస్తుపోతున్నారు. సిడ్నీ డీన్ (27) అనే యువతిని ఆమె మాజీ ప్రియుడి తండ్రి పాల్ (51) మనువాడాడు.
సిడ్నీ 11 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు పాల్ కొడుకుతో ఆడుకునేందుకు వస్తుండగా వీరికి తొలిసారి పరిచయమైంది. సిడ్నీ తరచూ వీకెండ్స్‌లో పౌల్ ఇంటికి వచ్చి వెళుతుండేది. పాల్ కొడుకు మరో గర్ల్‌ఫ్రెండ్‌కు దగ్గర కావడంతో వారి ఇంటికి వచ్చినప్పుడు పౌల్‌తో మాట్లాడుతుండేది. సిడ్నీకి 16 ఏండ్లు రాగానే పాల్‌తో డేటింగ్ చేయడం మొదలైంది.
పాల్‌తో తాను ప్రేమలో పడతానని ఎన్నడూ అనుకోలేదని అది అలా జరిగిపోవడం సంతోషంగా ఉందని సిడ్నీ చెబుతోంది. తమ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటంతో తమ తల్లితండ్రులు తమ రిలేషన్‌షిప్‌పై మొదట్లో అభ్యంతరం చెప్పినా ఇప్పుడు అర్ధం చేసుకున్నారని తెలిపింది. వయసు తేడా ఉన్న జంటలు ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకుంటారని ఒకరి పట్ల మరొకరు కేరింగ్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది. తనను పాల్ చాలా బాగా చూసుకుంటాడని చెప్పింది.