గువాహతి: డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు కొందరు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. అయినప్పటికీ పోలీసుల చేతికి చిక్కుతున్నారు. అస్సాంలో ఒక లారీలోని ఆయిల్ ట్యాంక్ లోపల దాచిన డ్రగ్స్‌ను తూర్పు గువాహతి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 205 ప్లాస్టిక్ సోప్ బాక్స్‌లలో ఉన్న 2.5 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, ప్లాస్టిక్ సబ్బు పెట్టెల్లో డ్రగ్స్‌ను రవాణా చేయడంపై పోలీస్ అధికారులు ఆశ్చర్యపోయారు.