e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News పోక్సో నిందితుడికి 20ఏండ్లు జైలు

పోక్సో నిందితుడికి 20ఏండ్లు జైలు

పోక్సో నిందితుడికి 20ఏండ్లు జైలు
  • బాలికపై అత్యాచారం కేసులో శిక్ష ఖరారు
  • పోక్సో కేసులో ఓ నిందితుడికి 20ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ నాంపల్లి మొదటి సెషన్‌ కోర్టు తీర్పు వెల్లడించింది.
  • భవానీనగర్‌ సీఐ ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ (24) ఐఎస్‌సదన్‌లోని అల్‌మదీనా హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు.
  • గతేడాది సెప్టెంబర్‌ 4న స్థానికంగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
  • దీంతో బాలిక తల్లి ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహ్మద్‌ యూసుఫ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
  • 4 నెలల్లోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చార్జీషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
  • దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి కుంచల సునీత నిందితుడికి 20ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
  • జరిమానా చెల్లించని పక్షంలో మరో 6నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పోక్సో నిందితుడికి 20ఏండ్లు జైలు

ట్రెండింగ్‌

Advertisement