యువ హీరో సాయిరామ్శంకర్ నటించిన చిత్రం ‘బంపర్ఆఫర్’.తాజాగా ఆయన హీరోగా అదే పేరును కొనసాగిస్తూ ‘బంపర్ఆఫర్-2’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ‘బంపర్ఆఫర్’ను తెరకెక్కించిన జయరవీంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. సురేష్ యల్లంరాజు, సాయిరామ్ శంకర్ నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది సీక్వెల్ కాదు. రాయలసీమ నేపథ్యంలో కొనసాగే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఉగాదికి చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: అశోక, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: భాస్కర్ రాజు చామర్తి.