చాంగ్‌చున్: చైనాలోని రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాంగ్‌చున్‌లో ఉన్న ఆ రెస్టారెంట్ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. అగ్నిప్రమాదంలో మరో మూడు మంది గాయపడినట్లు తెలుస్తోంది. జిలిన్ ప్రావిన్సులో చాంగ్‌చున్ సిటీ ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మంటల్ని ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.