మాస్కో : ఓ దుండగుడు రష్యాలో రక్తపుటేరులు పారించారు. ఓ స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఇన్హెవెస్క్ సిటీలోని ఓ స్కూల్ వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది చనిపోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు టీచర్లు కూడా మృతి చెందారు.
గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కూడా తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దుండగుడు బ్లాక్ కలర్లో ఉన్న దుస్తులు ధరించినట్లు రష్యా బలగాలు పేర్కొన్నాయి. ఆ డ్రెస్‌పై నాజీ సింబల్స్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపాడో తెలియాల్సి ఉందని బలగాలు పేర్కొన్నారు.