e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, April 14, 2021
Advertisement
Home News 13 అడుగుల భారీ కొండచిలువ..!

13 అడుగుల భారీ కొండచిలువ..!

13 అడుగుల భారీ కొండచిలువ..!

కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలో 13 అడుగుల పొడ‌వున్న భారీ కొండ‌చిలువ క‌ల‌కలం సృష్టించింది. సిలిగురి జిల్లాలోని ఫుల్‌బ‌రి ప‌ట్ట‌ణానికి స‌మీపంలో రోడ్డ‌ప‌క్క‌నే ఉన్న నీటిపైపులో ఆ కొండచిలువ ప్ర‌త్య‌క్ష‌మైంది. నీళ్ల‌లో పైపుల భారీ కొండ‌చిలువ‌ను చూసిన స్థానికులు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే స్థానికులు కొంద‌రు ఆ కొండ చిలువ‌ను పైపు నుంచి వెలుప‌లికి తీసేందుకు ప్ర‌య‌త్నించినా అది సాధ్యంకాలేదు. 

దాంతో గ్రామ‌స్తులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. గ్రామ‌స్తుల స‌మాచారం మేర‌కు అక్క‌డికి చేరుకున్నదేబ్‌గ్రామ్ రేంజ్‌ అట‌వీశాఖ అధికారులు ఆ భారీ కొండ‌చిలువను ర‌క్షించి తీసుకెళ్లారు. అది బ‌ర్మా జాతికి చెందిన కొండ‌చిలువ అని, ఆ జాతి కొండచిలువ‌లు సుమారుగా 20 అడుగుల వ‌ర‌కు పొడ‌వు పెరుగుతాయ‌ని, పొడ‌వుకు త‌గిన మందం ఉంటాయ‌ని అధికారులు తెలిపారు.  

Advertisement
13 అడుగుల భారీ కొండచిలువ..!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement