e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ స‌మ‌ర్పించిన ఎన్సీబీ

సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ స‌మ‌ర్పించిన ఎన్సీబీ

సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ స‌మ‌ర్పించిన ఎన్సీబీ

ముంబై : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇవాళ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో చార్జిషీట్‌ను దాఖ‌లు చేసింది.  సుశాంత్ మృతితో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో సుమారు 12వేల పేజీల చార్జిషీట్‌ను ఇవాళ ప్ర‌త్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో స‌మ‌ర్పించారు.  సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు మ‌రో 32 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్న‌ట్లు ఆ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఎన్సీబీ చీఫ్ స‌మీర్ వాంఖ‌డే ఈ చార్జిషీట్‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.  సుశాంత్ అనుమానాస్ప‌ద మృతికి సంబంధించి ఎన్సీబీ గ‌త ఏడాది ఆగ‌స్టులో రెండు కేసుల‌ను న‌మోదు చేసింది.  ఈ కేసుతో లింకు ఉన్న సుశాంత్ గ‌ర్ల‌ఫ్రెండ్ రియాను గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో అరెస్టు చేశారు.  రియా సోద‌రుడు శౌవిక్‌ను కూడా అరెస్టు చేసి ఆ త‌ర్వాత బెయిల్‌పై వ‌దిలేశారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్సీబీ అధికారులు 34 మందిని అరెస్టు చేశారు.ఈ కేసు విచార‌ణ‌లో 200 మంది సాక్షుల‌ను విచారించారు. డిజిట‌ల్ ఫార్మాట్‌లో చార్జిషీట్ సుమారు 50 వేల పేజీలు ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ స‌మ‌ర్పించిన ఎన్సీబీ

ట్రెండింగ్‌

Advertisement