దుబాయ్: టీ20 వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీల్లో స్కాట్లాండ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సూపర్ 12 స్టేజ్‌కు ఆ జట్టు దగ్గరవుతోంది. పాప్వా న్యూ గునియాపై 17 పరుగులతో.. అంతకముందు ఫెవరేట్స్ బంగ్లాదేశ్‌పైన కూడా గెలిచిన స్కాట్లాండ్ జట్టు గ్రూపు బి స్టేజ్‌లో దూసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ క్రికెట్ .. 12 ఏళ్ల అమ్మాయికి థ్యాంక్స్ చెప్పింది. స్కాట్లాండ్ క్రికెటర్లు వేసుకున్న జెర్సీని 12 ఏళ్ల రెబెక్కా డౌనీ డిజైన్ చేసినట్లు తమ ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. జెర్సీ వేసుకున్న రెబెక్కా ఫోటోను కూడా స్కాట్లాండ్ జట్టు పోస్టు చేసింది. రెబెక్కాది హాడింగ్టన్. జట్టు జెర్సీని వేసుకుని మ్యాచ్‌లను తిలకిస్తున్న రెబెక్కాకు థ్యాంక్స్ అంటూ క్రికెట్ స్కాట్లాండ్ తన ట్వీట్లో పేర్కొన్నది.