మెక్సికో సిటీ: మెక్సికోలోని (Mexico) గ్వానాజువాటో రాష్ట్రంలో దారుణం చోటుచేసుకున్నది. తరిమోరో పట్టణంలో ఉన్న పూల్ హాల్‌పై (Pool hall) డ్రగ్స్ ముఠా దాడికి పాల్పడింది. తుపాకులతో విచాక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పది మంది మృతిచెందారు. ఘటనా స్థలంలోనే తొమ్మిది మంది మరణించారని, మరొకరు దవాఖానలో చనిపోయారని గ్వానాజువాటో గవర్నర్ వెల్లడించారు. దాడిని తీవ్రంగా ఖండించారు.
కాగా, గ్వానాజువాటోలో నిత్యం హింస చోటుచేసుకుంటునే ఉంటుంది. డ్రగ్స్ రవాణా, చమురు దొంగతనానికి సంబంధించి రెండు గ్రూపుల మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతుంది. దీంతో రాష్ట్రంలో తుపాకీ కాల్పుల మోత పరిపాటిగా మారింది. ఈనేపథ్యంలో డ్రగ్ మఫియాను కట్టడిచేయడానికి ప్రభుత్వం మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించింది.