-చిలువేరు ఆదిలక్ష్మి, ఎల్.బి.నగర్
దేశ రక్షణలో ముందుండేవారు సైనికులు, వారి కుటుంబాలు. కాబట్టి, వాళ్ల గృహాలు గొప్పగా ఉండాలి. యుద్ధాలు, సరిహద్దు ఘర్షణల్లో ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేశారు. అయితే వారి ఇళ్లలో లోపాల కారణంగా ఇలా జరిగినట్లుగా మాత్రం భావించవద్దు. సూర్యుడు అస్తమించినా, ఉదయించినా ఆయన విలువ తగ్గదు. అయితే సైనికుల పిల్లలు, వారి కుటుంబాలు మరింత ఉన్నతంగా జీవించడానికి ఆ ఇళ్లు శాస్త్రబద్ధంగా ఉండాలి. ఇల్లంటే కేవలం డబ్బు ఇచ్చేదే అనుకుంటారు చాలామంది. అది నిజం కాదు. వాస్తు శాస్త్రం మనిషిలో ధైర్య సాహసాలు పెంచే ప్రకృతి శక్తికి ప్రతిరూపం. ఇది అందరికీ వర్తిస్తుంది.
దక్షిణం గేటు – ఉత్తరం గేటు సమానంగా ఉండాలా? లేకున్నా ఫర్వాలేదా?
-వి. అన్నపూర్ణ, కొడంగల్
గేట్లు దిశనుబట్టి చిన్నవిగా- పెద్దవిగా పెట్టుకోవచ్చు. తూర్పు గేటు అవసరమైన కొలతలో తూర్పులో కానీ, తూర్పు ఈశాన్యంలో కానీ పెట్టుకున్నప్పుడు, పశ్చిమ గేటు అంతే వెడల్పు, ఎత్తు ఉన్నది పెట్టుకోవచ్చు. లేదా వెడల్పు తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. ఇంటి దక్షిణంలో పెద్దగేటు పెట్టి, ఇంటికి ఉత్తర ఈశాన్యంలో చిన్నగేటు పెట్టవద్దు. ఇక రెండు గేట్లు ఎదురెదురుగా పెడితే, సమాన కొలతల గేట్లు, సమాన కొలతలతో దారం పెట్టి చక్కగా దిశలకు బిగించాలి. చిన్నగేటును దక్షిణంలో, పెద్దగేటును ఉత్తరంలో పెట్టాల్సి వచ్చినప్పుడు, పెద్దగేటు మధ్య కొలతకు చిన్నగేటు మధ్య కొలతకు మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ‘కంతలు’ కలిపి పెట్టవద్దు.
ఇంటి బేస్మెంట్కు దక్షిణంలో డ్రైనేజ్ లైన్ ఉండాలా?
కోళ్ల ఫారం దిశకు తప్పకుండా ఉండాలా?
-తోట రాజేందర్ రెడ్డి, షాద్నగర్
‘మనిషి విజ్ఞాని కోడి కాలజ్ఞాని’ అన్న నానుడి తెలిసిందే. కోడి జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. కాబట్టి కోళ్ల ఫారాలు తప్పకుండా దిశకు ఉండాలి. కోళ్లు ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తాయి. ‘దిశ జరిగిన’ నిర్మాణాలలో వాటి జీవన ఉత్పత్తి కుంటుపడుతుంది. గుడ్ల పొదుగుదలలో ‘సమ ఉష్ణత’ జనించదు. ఉత్పత్తి పడిపోతుంది. అడ్డదిడ్డంగా షెడ్లు వేయడం చాలా దోషం. అందువల్ల కోళ్ల ఫారాలకు దిశను నిర్దిష్టంగా నిర్ధారించి నిర్మాణాలు చేయాలి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678