న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రంలో అనేక దీవులున్న దేశం. ఆస్ట్రేలియా నుంచి సుమారు 2000 మైళ్ల దూరంలో ఉంది. నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్‌లతో పాటు సుమారు 600కు పైగా ద్వీపాల కలయిక దేశం. ఇక్కడ జనాభా సుమారు 50 లక్షలు. ఇక్కడి అధికార భాష ఇంగ్లిష్. వివిధ ఖండాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర పడినవారు చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం యూరోపియన్ మూలాలు ఉన్నవారే. ప్రపంచంలో 52వ పెద్ద ఎకానమీ ఉన్న దేశం. ఇక్కడ సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్, టూరిజం వంటి అనేక రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఎక్కువ శాతం ఉద్యోగాలు సర్వీస్ సెక్టార్లోనే ఉన్నాయి. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలతో వాణిజ్య సంబంధాలున్నాయి. ప్రపంచంలోని అందమైన దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఉంది. న్యూజిలాండ్‌లో ప్రపంచంలో గుర్తింపు పొందిన ఉన్నత విద్య, రిసెర్చ్ అవకాశాలు, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండటం వల్ల ఇక్కడ చదువుకోడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
న్యూజిలాండే ఎందుకు?
మేనేజ్మెంట్, హెల్త్, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఐడీపీ అంచనా ప్రకారం సౌత్ ఐలాండ్‌లో చదవడానికి 15,000-20,000 న్యూజిలాండ్ డాలర్లు, నార్త్ ఐలాండ్‌లో చదవడానికి సంవత్సరానికి 18,000 నుంచి 25,000 న్యూజిలాండ్ డాలర్ల ఖర్చవుతుందని అంచనా. ఇంటర్నేషనల్ మాస్టర్స్ స్టూడెంట్స్‌కు సుమారు 26,000-37,000 న్యూజిలాండ్ డాలర్ల ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఇది కోర్సుని బట్టి కూడా ఉంటుంది. ఒక న్యూజిలాండ్ డాలర్ సుమారు రూ.52.
నంబియో ప్రకారం ఆస్ట్రేలియాతో పోలిస్తే కన్జ్యూమర్ గూడ్స్ ధరలు న్యూజిలాండ్‌లో 3.94 % తక్కువ. రెంట్ 6.94% తక్కువ. రెంట్ అమెరికాతో పోలిస్తే తక్కువ. కానీ గ్రాసరీస్, కన్జ్యూమర్ వస్తువుల ధరలు అమెరికా కన్నా ఎక్కువ.
ఐలాండ్ దేశం కాబట్టి ఇంపోర్ట్స్ పై ఎక్కువగా ఆధారపడతారు. మెషినరీ, వెహికల్స్, క్రూడ్ ఆయిల్ వంటి ఇంపోర్ట్స్, ట్యాక్స్‌ల వల్ల కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది. టూరిస్టులు ఖర్చులు ఎక్కువ చేస్తారు కాబట్టి కొన్ని ప్రొడక్ట్స్ పై ధర ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లివింగ్ కాస్ట్ కోసం కనీసం 15,000 న్యూజిలాండ్ డాలర్లు ఉండాలి.
గ్లోబల్ పీస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ప్రకారం 172 దేశాల్లో న్యూజిలాండ్ సోషల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ద్వితీయ స్థానంలో ఉంది.
న్యూజిలాండ్ కొన్ని సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ పై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల రెవెన్యూ ఉంటుంది. కాబట్టి వారికి ఇక్కడ సరైన సపోర్ట్ సిస్టం ఉంది. ట్యూషన్ ఫీజు ఇతర టాప్ దేశాలతో పోలిస్తే తక్కువ, స్కాలర్షిప్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచు, కొండలు తీర ప్రాంతాలు కలిగి ఉన్న అందమైన దేశం కాబట్టి ఇక్కడ అన్ని దేశాల సినిమా షూటింగులు జరుగుతాయి. ప్రఖ్యాత లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది.
ఇక్కడ చదువు కోసం వచ్చినవారు ఖర్చుల కోసం వారానికి కొన్ని గంటలు పని చేసుకోవచ్చు.
బ్రిటిష్ కల్చర్, మావోరీ కల్చర్ మేళవింపు కలిగిన దేశం.
ఇక్కడ గ్రాడ్యుయేట్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత స్కిల్డ్ మైగ్రెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆక్లాండ్: నార్త్ ఐలాండ్‌లో ఉన్న అధిక జనాభా గల పెద్ద నగరాల్లో ఒకటి. కొండలు, రెండు హార్బర్లు, నేచురల్ అడ్వెంచర్స్‌తో పాటు వివిధ అభిరుచులను ఆకట్టుకునే మ్యూజిక్, ఫుడ్ గల నగరం. సుమారు 1.6 మిలియన్ జనాభా గల ఈ నగరంలో సుమారు 25% జనాభా ఆసియన్ మూలాలు ఉన్నవారు. ఆక్లాండ్ యూనివర్సిటీ, ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు.
వెల్లింగ్టన్: దేశ రాజధాని నగరమైన వెల్లింగ్టన్ నార్త్ ఐలాండ్ దక్షిణ భాగంలో కుక్ స్ట్రైట్ పై ఉంది. నౌకాశ్రయం ఉన్న ఈ నగరం చుట్టుపక్కల కొండలపై రంగురంగుల కలప ఇండ్లు పర్యాటకులను ఆకర్శిస్తుంటాయి. విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్ ఇక్కడ ఉంది.
హామిల్టన్: వైకాటో నది పై ఉన్న ఈ నగరం హామిల్టన్ గార్డెన్స్‌కి ఫేమస్. అలాగే ఇక్కడి కొండలు, ఇసుక బీచ్‌లతో పాటు ఇక్కడికి దగ్గరలోనే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలోని హోబిటన్ నగరం సందర్శకులను ఆకర్షిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ వైకాటో ఇక్కడి ప్రముఖ యూనివర్సిటీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ వెల్లింగ్టన్ కన్నా తక్కువ.
డునెడిన్: ఈ నగరం సౌత్ ఐలాండ్‌లోని సౌత్ ఈస్ట్ కోస్ట్‌లో ఉంది. స్కాటిష్, మావోరీ కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. విక్టోరియన్, ఎడ్వర్డియన్ ఆర్కిటెక్చర్ ఇక్కడ చూడవచ్చు. సైక్లింగ్, హైకింగ్ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో ఇక్కడి ప్రముఖ యూనివర్సిటీ.
చర్చిగేట్: ఇంగ్లిష్ హెరిటేజ్‌ని తలపించే చర్చిగేట్ సిటీ సౌత్ ఐలాండ్‌లో ఉంది. సుమారు 4 లక్షల జనాభా ఉన్న అందమైన నగరం.
యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బరీ: ఇక్కడి ప్రముఖ యూనివర్సిటీ. స్ట్రీట్ ఆర్ట్ ఇక్కడ కనిపిస్తుంది. 2011 భూ కంపం వల్ల ఈ దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నష్టం కలిగింది. కానీ ఈ నగరం దానికి తట్టుకొని త్వరగా అభివృద్ధిలోకి వచ్చింది. బైక్ రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.
టౌరంగా: టౌరంగా నార్త్ ఐలాండ్‌లోని నగరం. జనాభా ప్రకారం 5వ పెద్ద నగరం. పార్కులు, బీచ్‌లు, ఫారెస్ట్ పార్క్, వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
టాప్ యూనివర్సిటీలు
యూనివర్సిటీ అఫ్ ఆక్లాండ్: 1883లో ప్రారంభించిన ఈ యూనివర్సిటీ ఆక్లాండ్‌లోని రిసెర్చ్ బేస్డ్ పబ్లిక్ యూనివర్సిటీ. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీల్లో పెద్దది, ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీల్లో ఉన్నది. ఇంటర్నేషనల్ ట్యూషన్ సుమారు 35,000 న్యూజిలాండ్ డాలర్లు అవుతుంది. ఆర్కియాలజీ, నర్సింగ్, ఆర్ట్స్, జియోగ్రఫీ, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, మెడికల్, లా, సైన్స్, బిసినెస్ స్కూల్స్ వంటి వాటిలో విద్యావకాశాలు ఉన్నాయి. ఇక్కడ కనీసం 18% విద్యార్థులు విదేశీయులే ఉన్నారు.
యూనివర్సిటీ అఫ్ ఒటాగో: డునెడిన్‌లో ఉన్న ఈ యూనివర్సిటీని 1869లో స్థాపించారు. కామర్స్, హ్యుమానిటీస్, హెల్త్ సైన్స్, సైన్సెస్, బిజినెస్ రంగాల్లో కోర్సులు ఉన్నాయి. సుమారు 35,000 న్యూజిలాండ్ డాలర్ల (కోర్సుని బట్టి) ట్యూషన్ ఫీజు ఉంటుంది. 21,000 మంది విద్యార్థులు చదువుతున్న ఇక్కడ 2500 పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. 20% విద్యార్థులు ఆసియన్ ఒరిజిన్వారు. – విక్టోరియా యూనివర్సిటీ అఫ్ వెల్లింగ్టన్: దీనిని 1897లో ప్రారంభించారు. ఇది సేఫ్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్లేస్. స్టూడెంట్ నివాసం, క్యాంపస్‌కి దగ్గరలో అవకాశం ఉంది. సుమారు 80 దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఆర్కిటెక్చర్, బిజినెస్ అండ్ గవర్నమెంట్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, హెల్త్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, లా, సైన్స్‌లో కోర్సులున్నాయి. హాస్పిటాలిటీ, లైబ్రరీ స్టడీస్, లీజర్ మేనేజ్మెంట్ వంటి ఆసక్తికరమైన కోర్సులు కూడా ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బరీ: సౌత్ ఐలాండ్‌లోని చర్చిగేట్‌లో ఉన్న ఈ పబ్లిక్ యూనివర్సిటీని 1873లో ప్రారంభించారు. ఇది న్యూజిలాండ్‌లోని రెండో ప్రాచీన యూనివర్సిటీ. సుమారు 17,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇంజినీరింగ్, హెల్త్, సైన్స్, లా, బిజినెస్‌లో అనేక కోర్సులున్నాయి. ఈ యూనివర్సిటీ సుమారు 100 క్వాలిఫికేషన్స్, 80 సబ్జెక్టుల్లో అందిస్తుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కోర్స్‌తో పాటు అకడమిక్స్‌లో కనీస మార్కులుండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి దరఖాస్తు చేసుకోవాలి.
మాసే యూనివర్సిటీ: పాల్మెర్సన్ నార్త్‌లో ఉన్న ఈ పబ్లిక్ యూనివర్సిటీని 1921లో ప్రారంభించారు. ఏవియేషన్, డిస్ప్యూట్ రెజుల్యూషన్, వెటర్నరీ మెడిసిన్, నానో సైన్స్ కోర్సులకు ప్రాముఖ్యత ఉంది. క్రియేటివ్ ఆర్ట్స్, హెల్త్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, సైన్సెస్, బిజినెస్ స్కూళ్లలో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 100 దేశాల నుంచి 4300 మంది ఇక్కడ చదువుకోడానికి వస్తుంటారు.
యూనివర్సిటీ అఫ్ వైకాటో: ఈ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ హామిల్టన్‌లో ఉంది. ఇంకో క్యాంపస్ టౌరంగాలో ఉంది. చక్కని గ్రీనరీ ఉన్న క్యాంపస్. సుమారు 2000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సుమారు 31,000 నుంచి 39,000 న్యూజిలాండ్ డాలర్లు మాస్టర్స్‌కి (120 పాయింట్స్ కోర్స్) ఖర్చవుతుంది. ఇంటర్ప్షిప్స్, గ్రాడ్యుయేట్ రోల్స్, వలంటీర్ వర్క్ అవకాశాలుంటాయి.
లింకన్ యూనివర్సిటీ: 1878లో ప్రారంభమయ్యింది. కాంటర్బరీ యూనివర్సిటీలో భాగంగా ఉన్న ఈ విద్యాలయం 1990లో ప్రత్యేక యూనివర్సిటీగా ఏర్పడింది. ఇక్కడి ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ కోర్సులు ఫేమస్. అగ్రికల్చర్, బిజినెస్, ఎన్విరాన్మెంట్, ఫుడ్ టూరిజం, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, స్పోర్ట్స్ రిక్రియేషన్, సైన్సెస్ వంటి రంగాల్లో ప్రత్యేక అవకాశాలున్నాయి.
ఆక్లాండ్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ: 1895లో ప్రారంభమయ్యింది. విదేశీ విద్యార్థులు ఎక్కువ శాతంలో ఉన్న కాలేజీ ఇది. సుమారు 140 దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఇండస్ట్రీ టై అప్స్ బాగున్నాయి.
న్యూజిలాండ్‌లో అడ్మిషన్ కోసం ఒకటి లేదా అధికంగా పరీక్షలు, అడ్మిషన్ క్రైటీరియా బట్టి రాయాలి. అలాగే కనీస ఎలిజిబిలిటీ స్కోర్‌ని తెచ్చుకోవాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్స్ IELTS, TOEFL, PTE అవసరం. కొన్ని కోర్సులకు ఇతర పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
అడ్మిషన్ వచ్చిన తరువాత వీసా ప్రాసెస్ మొదలుపెట్టాలి. వీసా రావడానికి కనీసం 8 వారాల సమయం పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో అది ఎక్కువ అవచ్చు. పాండమిక్ వల్ల న్యూజిలాండ్ బోర్డర్స్ మూతపడి ఉన్నాయి. బెంగళూరు, కొచ్చిన్, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, ముంబై సెంటర్లు ప్రస్తుతం తాత్కాలికంగా మూతపడ్డాయి. హై కమిషన్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఆఫీస్ మాత్రమే పనిచేస్తుంది. ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్ స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా ఫొటో, డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
2022 అడ్మిషన్ సైకిల్ ప్రారంభమైంది. కావాల్సిన పరీక్షలు రాసి, సరైన యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోండి. మూతపడిన క్యాంపస్‌లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT