మామడ : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ జలపాతం కనువిందు చేస్తున్నది. దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల మధ్య ఉన్న 25 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్నది. వాస్తాపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో ఘాట్ రోడ్డు గుండా ప్రయాణిస్తే ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.