భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మైనారిటీ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎవరు అర్హులు ?
జైన, బౌద్ధ, సిక్కు, జొరాస్ట్రియన్, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. అకడమిక్ ప్రతిభ, పుట్టినతేదీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్
అర్హతలు: ఒకటి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కుటుంబ వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు.
స్కాలర్షిప్: ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు కింద ఏడాదికి రూ.500, ట్యూషన్ ఫీజు కింద నెలకు రూ.350 చెల్లిస్తారు. మెయింటెనె న్స్ అలవెన్స్ కింద డేస్కాలర్ విద్యార్థులకు నెలకు రూ.100 ఇస్తారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతూ హాస్టల్లో ఉండే వారికి నెలకు రూ.600 ఇస్తారు.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
అర్హతలు: ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ లేదా డిగ్రీ/ పీజీ / పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
స్కాలర్షిప్: అడ్మిషన్+ ట్యూషన్ ఫీజు కింద ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రూ.7,000. ఇంటర్ లెవల్లో ఒకేషనల్/ టెక్నికల్ కోర్సులు చదివే వారికి ఏడాదికి రూ.10,000, డిగ్రీ/ పీజీ అభ్యర్థులకు ఏడాదికి రూ.3,000 చెల్లిస్తారు. మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ఇంటర్ స్థాయి కోర్సులు చదువుతున్న హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.380, డే స్కాలర్ విద్యార్థులకు నెలకు రూ.230, డిగ్రీ, పీజీ చదువుతున్న హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.570, డే స్కాలర్ అభ్యర్థులకు రూ.300, పీహెచ్డీ, ఎంఫిల్ చేస్తున్న హాస్టల్ అభ్యర్థులకు నెలకు రూ.1200, డే స్కాలర్ అభ్యర్థులకు రూ.550 చెల్లిస్తారు.
మెరిట్ కం మీన్స్ స్కాలర్షిప్
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సుల్లో చేరినవారు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
కుటుంబ వార్షికాదాయం రెండున్నర లక్షలకు మించరాదు.
స్కాలర్షిప్: కోర్సు ఫీజు కింద ఏడాదికి రూ.20,000, మెయింటెనెన్స్ అలవెన్స్ కింద హాస్టల్ ఖర్చుల కోసం నెలకు రూ.1,000, డే స్కాలర్‌కి నెలకు రూ.500 ఇస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు చివరితేదీ:
నవంబర్ 15
పోస్ట్ మెట్రిక్, మెరిట్ కం మీన్స్
స్కాలర్‌షిప్‌లకు చివరితేదీ: నవంబర్ 30
వెబ్సైట్: minorityaffairs.gov.in