తంగేడు పూల ఆకృతియే బతుకమ్మా!
తెలంగాణ సంస్కృతియే బతుకమ్మా! ॥తం॥
రమణులకే నవ క్రీడారంగమై
రాష్ట్రంనే సాధించెను బతుకమ్మా! ॥తం॥
రైతన్నలు రేబవలూ కష్టించీ
పంటలు పండిస్తేనే మెతుకమ్మా ! ॥తం॥
నేతన్నలు అందించే వస్ర్తాలే
మాన రక్షణల పోగుల అతుకమ్మా ॥తం॥
నిధులు యిలను ఎందరికీ ఎన్నున్నా
నీటితోనె నాగరికత బ్రతుకమ్మా ! ॥తం॥
చిత్రంగా శిరసెత్తి వసంతంలో
చిగురించీ పుష్పించును ప్రతి కొమ్మా ॥తం॥
చులకనగా దేనిని ‘వడ్డేపల్లీ’
చూడరాదు ఇది సత్యం కనుగొమ్మా ! ॥తం॥
– వడ్డేపల్లి కృష్ణ
92465 41699