జనాల మెప్పుకోసం కొందరు అర్థం లేని అబద్ధాలు చెబుతుంటారు. అవకాశం దొరికితేచాలు, అంచనాలకు అందకుండా బొంకుతుంటారు. అవి నమ్మశక్యంగా లేకపోయినా నమ్మించే ప్రయత్నం చేస్తారు. అటువంటివారిని ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. కొంచం కోతలు కొయ్యరా (చిన్న అబద్ధం చెప్పరా) అని పోలిగాణ్ని పిలిచి అడిగితే, అదే అవకాశమని.. ‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత ఉంటయి’ అన్నాడట. మిరియాలు తాటికాయంత ఉండటం ఏమిటి? మరీ అతిశయోక్తి కదా!