హెల్సింకి: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలకు మెల్లగా వ్యాపిస్తున్నది. తాజాగా ఫిన్లాండ్లో ఎంయూ వేరియంట్ తొలి కేసు నమోదైంది. దీంతో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన దేశాల సంఖ్య 40కి చేరింది. శరీరం రోగనిరోధక ప్రతిస్పందనపై ప్రభావం కోసం అధ్యయనం చేయవలసిన కొన్ని ఉత్పరివర్తనాలను ఎంయూ వేరియంట్ కరోనా (బి.1.621) కలిగి ఉంది. ఈ నేపథ్యంలో దీనిని ఆసక్తి రేపుతున్న వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో వర్గీకరించింది. అయితే అంటు వ్యాధికి కారణమయ్యే ఈ వైరస్ వేరియంట్ ఇతర వైవిధ్యాలతో పోలిస్తే అదనపు ముప్పు కలిగించబోదని పేర్కొంది. దక్షిణ అమెరికాలోని కొలంబియాతో పాటు ఇతర దేశాల్లో ఎంయూ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతుండటంపై WHO ఇప్పటికే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.