e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్ర

దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్ర

హన్మకొండ, మార్చి 12 : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు విజయవంతమవుతున్నాయం టే అందులో ఉద్యోగుల పాత్రే ముఖ్యమైనదని రా ష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. హన్మకొండలోని పాపుడమ్స్‌ కన్వెన్షన్‌ హాల్‌లో టీజీవో వరంగల్‌ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ అన్నమనేని జగన్మోహన్‌రావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన టీజీవోల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి మా ట్లాడారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తు న్న సీఎం కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నాయ న్నారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారుకు అండగా ఉండి పల్లా ను భారీ మెజార్టీతో గెలిపించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సత్తాచాటాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల రాష్ర్టానికి రెవెన్యూ తగ్గినా ముఖ్యమైన పథకాలకు, ఉద్యోగుల వేతనాలకు ఇబ్బంది కలుగకుండా చూశామన్నారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సి టీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఉద్యోగుల కృషితోనే అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.
కరోనా సమయంలోనూ ఉద్యోగులు ఫ్రంట్‌లై న్‌ వారియర్లుగా పనిచేశారని కొనియాడారు. ఉ ద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్ద ని, సమస్యలను కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌ విషయంలో ఆశించిన దానికంటే ఎక్కువ సంతోషపడేలా సీఎం కేసీఆర్‌ నోట త్వరలో శుభవార్త వింటారని చెప్పారు. బీజేపీ నాయకులు మా టల గారడీ చేస్తున్నారని, నమ్మవద్దని సూచించా రు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ఒక్కసారి విశ్లేషించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు పల్లా, వాణీదేవికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యం..

  • బోయినపల్లి వినోద్‌కుమార్‌
    స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, నేడు సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలోనూ భాగస్వాములవుతున్నారని బో యినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కొందరు తెలివి లేని వారు తెలంగాణ అప్పులపాలైందంటున్నారని, భారీ ప్రాజెక్టుల కోసమే అప్పులు చేశామన్నారు. దేశంలో తెలంగాణ ఉద్యోగులకే ఎక్కు వ వేతనం ఉండాలనేది సీఎం ఉద్దేశమని, త్వరలోనే అది అమలు చేస్తారని చెప్పారు. దుర్మార్గులు ఏవేవో మాట్లాడుతున్నారని, పట్టించుకోకుండా ఎమ్మెల్సీ అభ్యర్థులు రాజేశ్వర్‌రెడ్డి, వాణీదేవిని గెలిపించుకోవాలని కోరారు.
    టీజీవోల మద్దతు..
    ఉద్యోగ సంఘాల నేతలు పరిటాల సుబ్బారా వు, కారం రవీందర్‌రెడ్డి, అన్నమనేని జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నామన్నారు. ఉద్యోగుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌ ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, ఇతర సమస్యలు పరిష్కరిస్తాననడం ఆనందాన్ని కలిగించిందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములమవుతామని చెప్పారు. ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, వాణీదేవికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేయడంతో పా టు మద్దతు తెలుపుతున్నామన్నారు. సమ్మేళనం లో టీజీవో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యదర్శి డా క్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ట్రెజరర్‌ ఈగ వెంకటేశ్వర్లు, వరంగల్‌ రూరల్‌ జిల్లా కార్యదర్శి ఫణికుమార్‌, రాష్ట్ర కార్యదర్శి కిరణ్‌కుమార్‌, టీఎన్జీవోస్‌ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ కోలా రాజేశ్‌ కుమార్‌గౌడ్‌, గజ్జ ల రాంకిషన్‌, పుల్లూరి వేణుగోపాల్‌, రాజేశ్‌, ప్ర భాకర్‌రెడ్డి, గెజిటెడ్‌ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement