కావలసిన పదార్థాలు
జొన్న పిండి: ఒక కప్పు, బెల్లం: అర కప్పు, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి: పావు టీస్పూన్, కొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: సరిపడా.
తయారీ విధానం
స్టవ్‌మీద గిన్నె పెట్టుకుని నువ్వులను ఒక నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక కప్పు నీళ్లుపోసి, బెల్లం వేసి కరిగేంతవరకూ బాగా కలుపుతూ వేడి చేయాలి. మరో గిన్నెలో జొన్న పిండి, వేయించిన నువ్వులు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి బెల్లం నీళ్లుపోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనె పోసి, పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని కవర్‌పై నూనె రాస్తూ బూరెల్లా ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే నోరూరించే జొన్న బూరెలు సిద్ధం.