వర్షాకాలం మొదలవగానే గొడుగుల దుమ్ము దులుపుతాం. కొందరేమో ఎండకాలంలో కూడా గొడుగు వాడతారు. అయితే దీన్ని ఏ కాలం కోసం తయారు చేశారో తెలుసా? నిజానికి, ఇవి ఎండాకాలం ఉపయోగించటానికే తయారయ్యాయి. అసలు గొడుగును ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. కానీ, 11వ శతాబ్దం నుంచే చైనాలో వాడిన దాఖలాలున్నాయి. ప్రాచీన ఈజిప్ట్, బాబిలోనియాల్లో గొడుగులను హోదాకు గుర్తుగా వాడేవాళ్లు. ఐరోపాలో గ్రీకులు గొడుగును ఎండకు రక్షణగా ఉపయోగించేవాళ్లు. ఉన్నత వర్గాలు, రాజ కుటుంబీకులు మాత్రమే గొడుగులను నీడకోసం వాడేవాళ్లు. వీళ్లందరికీ విరుద్ధంగా గొడుగును వానకు తడవకుండా ఉపయోగించే వాళ్లు ప్రాచీన రోమన్లు. క్రీ.శ 1680లో ఫ్రాన్స్‌లో, తర్వాత ఇంగ్లండ్‌లో గొడుగును ఉపయోగించడం మొదలు
పెట్టారు. 18వ శతాబ్దం నుంచి ఐరోపా అంతటా వానకు రక్షణగా గొడుగును వాడటం మొదలుపెట్టారు.
అర్థాలేంటి?
మండలపతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతీ
భావం : పెద్దదైన ఏనుగు తొండం లేకుండా ఏమైనా పని చేయగలదా? లేదు కదా! రాజు, మంత్రి ఇద్దరూ తెలివిగలవారు అయినప్పుడే రాజ్యం పేరొందుతుంది. ఏ ఒక్కరు అవివేకి అయినా, ఏనుగుకు తొండం లేనట్లేనని భావం.