సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశం పురోగమిస్తుంది. తెలంగాణలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగినట్టుగా.. దేశ ప్రజలకు జరుగుతుంది. ఉంటుంది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, భగీరథ, దళితబస్తీ, దళితబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అద్భుత పథకాలు అమలు చేస్తూ బంగారు తెలంగాణగా మార్చారు. భారతదేశం కూడా స్వర్ణ భారత్‌గా మారుతుంది. మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మంచి పథకాలను అమలు చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. దేశ ప్రజలకు సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వ లక్షణాలు కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ వంటి నాయకులుంటే ప్రజలకు రక్షణ ఉంటుంది.
మార్పు ఖాయం
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ధరలు పెంచి సామాన్యుడిని వేధిస్తున్నాయి. సంపన్న వర్గాలకే పట్టం కడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలను అణగతొక్కుతున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో దూసుకెళ్తున్నది. రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతూ సంక్షోభం లేకుండా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్. ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపెడితే ఇక దేశంలో సంచలనం ఖాయం. ప్రశ్నించేవారిపై ఈడీ, సీబీఐ అంటూ ప్రస్తుతం కేంద్రం చేస్తున్న అరాచకం సాగనివ్వవద్దని అన్ని పార్టీల నాయకులు అంటున్నారు. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీ య స్థాయిలో ఉంటే ఈ ఆటలు ఇక సాగవు. హేమాహే మీలతో ఏర్పడే ఫ్రంట్‌కు నిస్సందేహంగా సీఎం కేసీఆర్ సారథ్యం వహించి పగ్గాలు చేపట్ట డానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. సీఎం కేసీఆర్‌లాంటి వారు జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశ రక్షణ, అన్ని రంగాల్లో ప్రగతి సుసాధ్యమని విద్యావం తుడిగా అభిప్రాయపడుతున్నా.
తెలంగాణ జాతికి గర్వకారణం..
నిర్మల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలం గాణ జాతి గర్విస్తుంది. తెలంగాణలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న ఆయన దేశ రాజకీయాల్లో కచ్చితంగా రాణిస్తారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇప్పటికే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ ఇంట గెలిచారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో రాణించి రచ్చ గెలవబో తున్నారు. మా మండలానికి జడ్పీ నిధులు రూ.40 లక్షలు మంజూర య్యాయి. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టాం. దేశ ప్రజలకు సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వ లక్షణాలు కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయి. అన్ని రాష్ర్టాల్లోని రైతులు బాగు పడాలన్నా.. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే.
– లోలం కళావతి, జడ్పీటీసీ, లోకేశ్వరం మండలం.
దేశ ప్రగతి కోసం నాయకత్వం అవసరం
జైపూర్, సెప్టెంబర్ 27 : కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే బంగారు భారత్ ఆవిష్కృతం అవడం ఖాయం. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయక త్వం అవసరం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతు మృతి చెందితే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ, బీడీ, చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే తెలంగాణలో అందిస్తున్న పథకాలు దేశమంతా వర్తింపజేస్తారు. కేసీఆర్ వంటి నాయకులుంటే ప్రజలకు రక్షణ ఉంటుంది. – మేడి సునీత, జడ్పీటీసీ, జైపూర్.
కేసీఆర్ బంగారు భారత్ చేస్తారు..
భీంపూర్, సెప్టెంబర్ 27 : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే పరమావధిగా పెట్టుకున్నది. సంక్షేమం, ప్రగతిని గాలికి వదిలేసింది. సామాన్యుల నుంచి ఉన్నతవర్గాల వరకు ధరల పెరుగుదలతో సతమతం అవుతుంటే పట్టన ట్టుగా వ్యవహరిస్తున్నది. పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు ఆకాశాన్నంటడంతో మధ్యతరగతి వారు విలవిల్లాడుతున్నారు. బండి బయటకు తియ్యాలన్నా, వంటింట్లో సిలిండర్ వెలిగించాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నింటిని ప్రైవేటీకరణ చేయ డంతో ఉద్యోగ భద్రత లేక లక్షలాది కుటుంబాలు అయోమయంలో పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి ఉద్యమవీరులు దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం మంచిది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, భగీరథ, దళితబస్తీ, దళితబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అద్భుత పథకాలు అమలు చేస్తూ బంగారు తెలంగాణగా మార్చారు. భారతదేశం కూడా స్వర్ణ భారత్‌గా మారుతుంది-తాటిపెల్లి రాజు, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్.
మార్పు కోసం చూస్తున్నరు..
దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక సంక్షోభం, అధిక ధరలతో ప్రజలు విసిగిపోయారు. దేశంలో నాయకత్వ మార్పునకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అవసరమైన సమయంలో కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అణువణువు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకు మంచి అవకాశాలున్నాయి. దేశంలో దళితులను ఆదుకు న్న సీఎం ఒక్కరూ లేరు. తెలంగాణలో జరుగుతున్న అభివృ ద్ధిని దేశమంతా చూస్తున్నది. దేశం రూపురేఖలు మారాలంటే తెలంగా ణలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. దేశానికి కేసీఆర్ సేవలు అవసరమని మన రాష్ట్రంతోపాటు పక్క రాష్ర్టాల వారు కూడా కోరుతు న్నారు. రైతు సంఘాల నాయకులు, ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు మన రాష్ర్టానికి వచ్చినప్పుడు అదే చెబుతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాలని మేం కూడా కోరుతున్నాం.
– కాంబ్లే ప్రజ్ఞశీల్, దళిత నాయకుడు, ఉట్నూర్.
కేసీఆర్‌ను దీవించనోళ్లు ఉండరు..
జైపూర్, సెప్టెంబర్ 27 : తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మస్తు మంచి పనులు చేస్తుండు. రైతులకైతే మేలు చేస్తున్నడు. ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చుడేగాక రైతుబంధు కింద పెట్టుబడికి డబ్బులిస్తండు. రైతు చనిపోతే వాళ్ల కుటుంబానికి రూ.5 లక్షలిచ్చి ఆదుకుం టున్నడు. ముసలోళ్లు, దివ్యాంగులకు ప్రతినెలా పింఛన్లు ఇచ్చి వాళ్లకు దేవునోలె అయ్యిండు. నిరుపేదల బిడ్డల పెండ్లిళ్లకు లక్ష రూపాల దాకా సాయం చేస్తున్నడు. ఇగ చెరువుల్లో చేపపిల్లలు పెంచి మాకు చేతినిండా పని కల్పించిండు. ఇది వరకు పనులు దొరకక అష్టకష్టాలు పడ్డం. ఇప్పుడు చేపలు అమ్ముకొని దర్జాగా బతుకుతున్నం. నా జీవితంలో ఇంత మం చి పనులు చేసిన ముఖ్యమంత్రిని చూడలే. ఇసొంటి నాయకుడు దేశాన్ని పాలిస్తే మంచిగుంటది. దేశం బాగుపడుతది. ఆయనను దీవించనోళ్లు ఉండరు.
-ఇండ్ల గోపాల్, గంగపుత్ర కులసంఘం అధ్యక్షుడు, ఇందారం, జైపూర్.
సంక్షేమ సారథి..దేశాన్ని స్వర్ణయుగం చేస్తడు..
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంటేనే సంక్షేమ సారథి. కేసీఆర్ ప్రవేశ పెట్టినన్నీ పథకాలు ఎవరు ప్రజలకు ఇవ్వలేదు. సీఎం దూరదృష్టితో ఆలోచిం చి రాష్ర్టాభివృద్ధికి సూపర్ పథకాలు అమలు చేస్తున్నడు. వీటిని దేశస్థాయిలో అమలు చేయడానికి బీజేపీ సర్కారు కాపీ కొడుతున్నది. ఇందులో మిషన్ భగీరథ, రైతుబంధు ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నది. కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ భారతదేశ చరిత్రలోనే నిలిచిపోతున్నాయి. భారత దేశ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అనేక రాష్ర్టాల రైతులు, ప్రజలు, నిపుణులు తెలంగాణకు వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్య పోతు న్నారు. ఏ రంగం తీసుకున్నా సూపర్ అని కితాబిస్తున్నారు. ఇంతేందుకు కేంద్ర అధికారు లు, మంత్రులే మన పథకాలు, ప్రగతిని పార్లమెంట్ సాక్షిగా కొనియాడారు. ఇంతకంటే ఇంకేం కావాలి. కేసీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడానికి. ప్రజలు కూడా బీజేపీ పాలనపై విసుకు చెంది ఉన్నారు. ఇదే సరైన సమయం. ఇప్పుడు గనుక దేశవ్యాప్త పర్యటన చేస్తే ప్రజానీకం జయహో కేసీఆర్ అని పలికే అవకాశం ఉంది. – నిర్మల సుమలత, గృహిణి, కాల్వ.