పల్లెవాసుల నోట్లో ఇటువంటి అందమైన సామెతలెన్నో అలవోకగా పలుకుతాయి. కష్టపడి పనిచేయడం చేతకాక, తినటానికి ఏం లేకపోయినా మాటలతో కాలం వెళ్లదీసే వాళ్లు నిత్యం తారసపడుతూనే ఉంటారు. అటువంటివారు రోజూ ఏవేవో కొత్త అబద్ధాలు చెప్తూ ఎదుటివారిని బోల్తా కొట్టిస్తుంటారు. అటువంటి వారిని ఉద్దేశించి చెప్పిన సామెతే ‘ఏం లేనోనికి ఏతులెక్కువ, చెల్లని రూపాయికి గీతలెక్కువ’. ఏం లేకపోయినా ఏవేవో కథలు చెప్తుంటారు. ఒక రూపాయి బిళ్ల చెల్లలేదంటే కారణం దానిపై గీతలు ఎక్కువగా ఉండటమే. ఇక దానికి అంగట్లో విలువ ఏముంటుంది? అందుకే ఎప్పుడూ కష్టపడాలి, చేసేదే చెప్పుకోవాలి.
అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే, సమాజంలో గౌరవం దక్కకపోగా.. నెగెటివ్ ముద్ర పడుతుంది.