సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలు చర్మంపై పడినప్పుడు, వాటిని గ్రహించడానికి చర్మం మెలానిన్ని ఎక్కువ మోతాదులో విడుదల చేస్తుంది. దీంతో ఎండకు చర్మం నల్లబడుతుంది. ఈ సమస్యకు వంటింట్లో పరిష్కారం ఉంది.
క్యాబేజీ : ఎండలో ఇంటికి రాగానే చర్మంపై చల్లటి క్యాబేజీ ఆకులను పావుగంటసేపు ఉంచాలి. ఇలా వారానికి రెండుసార్లయినా చేయాలి.
పెరుగు : సన్ ట్యాన్‌ను తొలగించడానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. రోజూ 10-20 నిమిషాలు చర్మానికి పెరుగుతో ప్యాక్ వేసి కడిగేయాలి.
కందిపప్పు పేస్ట్ : కందులను ఐదారుగంటలు నానబెట్టి, మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమంలో టమాటా లేదా కలబంద గుజ్జు కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా రెండ్రోజులకోసారి చేస్తే ట్యాన్ తగ్గి చర్మకాంతి మెరుగుపడుతుంది.
సొరకాయ : సన్ట్యాన్ని దూరం చేయడానికి సొరకాయ రసాన్ని వారానికి నాలుగుసార్లు చర్మంపై పూయాలి. పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మచ్చలు తగ్గుతాయి.