బయాలజీలో ఫుల్ స్కోర్
విసర్జనవ్యవస్థ
క్షీరదాల మూత్రపిండం బాహ్య అంతర లక్షణాలను అధ్యయనం చేయడానికి మీరు అనుసరించిన ప్రయోగ విధానం, ఫలితం, జాగ్రత్తలను వివరించండి?
మూత్రం ఏర్పడే విధానంలోని దశలను వివరించండి?
మానవునిలో మూత్రపిండం వైఫల్యం చెందినప్పుడు కృత్రిమ పద్ధతిలో డయాలసిస్ చేసే విధానాన్ని వివరించండి?
వివిధ రకాల జీవుల్లో విసర్జక అవయవాల అంశానికి సంబంధించిన పట్టిక, వివిధ మొక్కల్లో ఏర్పడే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల పట్టిక రూపొందించుకొని స్వీయ అభ్యసనం కింద ప్రశ్నలను తయారు చేసుకొని వాటికి సమాధానాలు రాసేలా ప్రాక్టీస్ చేయాలి. విసర్జించడం,
స్రవించడం మధ్యగల భేదాలు ఏమిటి?
మెదడులోని వివిధ భాగాలు అవి నిర్వహించే విధులు
సహానుభూత నాడీ వ్యవస, సహ సహానుభూత నాడీ వ్యవస్థ మధ్య గల తేడాలు
మానవుడిలోని అంతస్రావ గ్రంథులు, మొక్కల్లో హార్మోన్లు, వాటి విధులు ఈ అంశాలకు సంబంధించి పట్టిక ఆధారంగా స్వీయ ప్రశ్నలు రూపొందించుకొని జవాబులు రాయగలగాలి.
ప్రత్యుత్పత్తి
జీవుల్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు
ఉన్నత స్థాయి మొక్కల్లో జరిగే శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలు
ప్రయోగశాల కృత్యం
రొట్టె మీద పెరుగుతున్న బూజు లేదా రైజోపస్ను గుర్తించడానికి మీరు అనుసరించిన ప్రయోగ విధానాన్ని పరిశీలనలు, జాగ్రత్తలు వివరించండి.
బొమ్మలు
శుక్రకణం బొమ్మ గీసి భాగాలు గుర్తించి ఫలదీకరణ సమయంలో శుక్రకణంలోని ఏ భాగం అండంలోకి చొచ్చుకొని పోతుంది
పుష్పం నిలువు కోతను చూపించే బొమ్మ గీసి భాగాలు గుర్తించండి.
పిండ కోశం బొమ్మ గీసి భాగాలు గుర్తించండి.
మొక్కల్లో జరిగే ద్వి ఫలదీకరణ విధానాన్ని వివరించండి.
అంతే కాకుండా కణచక్రం, సమ విభజన లోని వివిధ దశలు, కుటుంబ నియంత్రణ మార్గాలు వంటి అంశాలపై పరీక్షలో ఏ రకమైన ప్రశ్నలు అడిగినా రాసే విధంగా సంసిద్ధమవ్వాలి.
అనువంశికత
గ్రెగర్ జోహన్ మెండల్ తన పరిశోధనలో భాగంగా బఠాణి మొక్కలను ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి?
ద్వి సంకరణ ఫలితాలను ఫున్నెట్ బోర్డు ద్వారా వివరించండి?
మానవునిలో లింగ నిర్ధారణకు కారణం మగవారే దీనిని అంగీకరిస్తారా? మీ సమాధానాన్ని ఫ్లో చార్ట్ ద్వారా వివరించండి?
నిర్మాణ సామ్య క్రియ సామ్య అవయవాలు?
పరీక్షలో చాయిస్ విధానం ఉంది. కాబట్టి ప్రతి పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తే జీవశాస్త్ర పరీక్షలో 10/10 GPA సాధించడం సులభం.
పోషణ
కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికం
స్వయం పోషకాలు పరపోషకాలు మధ్య భేదాలు
కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియకు మధ్య భేదాలు
కాంతి చర్య – నిష్కాంతి చర్య విధానాలు
జీర్ణవ్యవస్థకు సంబంధించిన పట్టిక, విటమిన్లకు సంబంధించిన పట్టికలను అవగాహన చేసుకొని వాటిపై ప్రశ్నలు రూపొందించుకొని అభ్యాసం చేయాలి.
ప్రయోగాల కు సంబంధించిన విద్యా సామర్థ్యం
కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించే మోల్స్ అర్ధపత్ర ప్రయోగం
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించే హైడ్రిల్లా ప్రయోగం
కిరణజన్య సంయోగ క్రియలో పిండిపదార్థాలు ఏర్పడతాయని నిరూపించే అయోడిన్ పరీక్ష
ఈ ప్రయోగాలకు సంబంధించి ప్రయోగ విధానం, పరిశీలన, ఫలితాలు, జాగ్రత్తలు వంటి అంశాలపై పట్టు సాధించాలి.
శ్వాసక్రియ
శ్వాసక్రియ లోని వివిధ దశలు
మానవుల్లో వాయు ప్రసారం మార్గం, కణ శ్వాసక్రియ వంటి అంశాలను ఫ్లో చార్ట్ రూపంలో గుర్తించాలి.
వాయు ప్రసార మార్గంలో ఉపజిహ్విక పాత్ర
పురుషులు, స్త్రీలలో శ్వాసక్రియ జరిగే విధానం ఉదర వితానం, పక్కటెముకల పాత్ర గురించి అవగాహన కలిగి ఉండాలి.
ఈ పాఠంలో ఉన్న ప్రయోగశాల కృత్యం
అవాయు శ్వాసక్రియ లో వెలువడిన నిర్ధారణ పరీక్ష ఉష్ణం, కార్బన్ డై ఆక్సైడ్ నిర్ధారణ (ఈస్ట్‌తో)
మొలకెత్తిన గింజల్లో శ్వాసక్రియ జరుగుతుందని నిరూపించే ప్రయోగం. మొలకెత్తిన గింజలు శ్వాసక్రియ జరుపుకొని ఉష్ణాన్ని విడుదల చేస్తాయని నిరూపించే ప్రయోగం
ఈ ప్రయోగాలకు సంబంధించి ప్రయోగ విధానం, పరిశీలన, జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.
ప్రసరణ వ్యవస్థ
ఒకే కీలక భావన ఆధారంగా వివిధ రకాలుగా పరీక్షల్లో ప్రశ్నలు వచ్చినా వాటికి సమాధానాలు రాసేలా అభ్యాసం చేయాలి?
ఉదాహరణకు మానవ హృదయ అంతర్నిర్మాణానికి సంబంధించి
మానవ హృదయం నిర్మాణాన్ని వివరించండి? మానవ హృదయ నిర్మాణాన్ని పరిశీలించడానికి మీరు అనుసరించిన ప్రయోగ విధానాన్ని పరిశీలనలు, జాగ్రత్తలను తెలపండి?
మానవ హృదయ అంతర్నిర్మాణాన్ని బొమ్మను గీసి భాగాలు గుర్తించండి?
మానవ హృదయ సంబంధమైన వ్యాధులు ఎలా వస్తాయో తెలుసుకోవడానికి మీరు కార్డియాలజిస్ట్ డాక్టర్ ని అడగడానికి ప్రశ్నావళి రూపొందించండి?
మొక్కల్లో నీరు రవాణా అయ్యే యాంత్రికం ఎపిడ్స్ను ఉపయోగించి మొక్కల్లో ఆహార సరఫరా ఏ విధంగా జరుగుతుందనే ప్రయోగ ఫలితాన్ని వివరించండి?
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత సంవత్సరం నుంచి విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. అయినప్పటికీ విద్యార్థులు నష్టపోకుండా విద్యా ప్రమాణాలు సాధించేందుకుగాను SCERT విద్యార్థులకు వర్క్ షీట్స్, ఆన్లైన్ తరగతులు, నిపుణ, T SAT వంటి టీవీ చానెల్ ద్వారా బోధన కార్యక్రమాలు నిర్వహించారు.
ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. సమయా భావం వల్ల NCERT guidelines ఆధారంగా SCERT సబ్జెక్టు నిష్ణాతులతో చర్చించి 30 శాతం సిలబస్ ను తొలగించింది. 70 శాతం పరిధిలో ఉన్న పాఠాలను మాత్రమే విద్యార్థులు పరీక్షకు సిద్ధం కావాలని తెలిపింది.
70% పరిధిలో ఉన్న పాఠాలు 30% తొలగించిన పాఠాలు
(పరీక్ష పరిధిలో)
1) పోషణ 7) జీవక్రియల్లో సమన్వయం
2) శ్వాసక్రియ 9) మన పర్యావరణం
3) ప్రసరణ 10) సహజ వనరులు
4) విసర్జన –
5) నియంత్రణ –
6) ప్రత్యుత్పత్తి –
8) అనువంశికత –
మిగిలిన మూడు పాఠాలు తొలగించినప్పటికీ పాఠ్యాంశాల్లోని అంశాలను కృత్యాలు, ప్రాజెక్టుల ద్వారా తెలుసుకొని ఉంటారు.
గత సంవత్సరంలా కాకుండా ఈ సారి పదోతరగతి పరీక్షలు 6 పేపర్లుగా చేశారు. ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ పేపర్స్ కలిపి 80 మార్కులు.
దీనిలో ఫిజికల్ సైన్స్ 40 మార్కులు బయో సైన్స్ 40 మార్కులు కేటాయించారు. మొదట ఫిజికల్ సైన్స్ పేపర్ తర్వాత బయో సైన్స్ పేపర్ వెంటనే రాయాల్సి ఉంటుంది.
బయో సైన్స్
పార్ట్-A గంట సమయం, పార్ట్-B 30 నిమిషాలు. విద్యార్థులు ముందుగా సమయ పాలన ఆధారంగా పరీక్షకు సిద్ధం కావాలి.
ప్రస్తుతం కుదించిన మొత్తం ఏడు పాఠాల్లో ప్రతి పాఠంలోని కీలక భావనలపై పట్టు సాధించాలి.
T.Rajashekar Rao
S.A (Bioscience)
Z.P.HS VENNACHERLA
NAGARKURNOOL