మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ బర్త్‌డే ఫిబ్రవరి 11న కాగా, ఆయన బర్త్‌డేని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు కలిసి ఘనంగా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ బర్త్‌డేకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఈ ఫొటోలలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపిస్తున్నారు.
కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన నటించిన మూవీస్‌కు సంబంధించి కొన్ని సర్ప్రైజ్లు ఇచ్చారు. కిన్నెర నుండి థిమ్ ఆఫ్ కిన్నెరసాని అంటూ ఓ వీడియో విడుదల చేయగా, ఇది నెటిజన్స్‌ను ఆకట్టుకుంది. మరోవైపు శ్రీధార్ సిపాన దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రానికి సంబంధఙంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు కళ్యాణ్ నటిస్తున్న సూపర్ మచ్చి నుండి ‘మీనమ్మ’ అనే పాటను విడుదల చేశారు. మూడు సర్ప్రైజ్లతో ఫ్యాన్స్ ఫుల్ థ్రిల్ అయ్యారు.