ఎచ్చిరుకం = కోపంతో చేసిందే మళ్లీ చేస్తే ఎచ్చిరుకం అంటారు
బడ్ఫా = మొరటోడు / మొర్దపోడు (బడ్ఫా సన్నాసి ఎంత చెప్పినా వినడు అంటారు. ఆంధ్రా ప్రాంతంలో బడవా అంటారు)
పుల్లెగండు = బాగా ఆశ పడేటోడు (పుల్లెగండు మొకపోడా, ఊకే మంది కంచాలపొంటి సూస్తవ్. నువ్వు గింత పుల్లెగండోనివి ఉన్నావ్ ఏంది రా?)
కాయిషు = ఇష్టం, కోరిక (ఏం రా! కాయిషు బాగా పడ్డట్టున్నావు)
టోంగా = నెత్తి మీద మొట్టికాయ (అరేయ్ లెక్కలు చేయకుంటే సారు టోంగాలు ఏత్తార్రా నెత్తి మీద)