మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ ప్రేమ విషయంతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మిషాల్ క్రిపాలనితో కలిసి చెట్టపట్టాలు వేసిన ఈ అమ్మడు అతనికి గుడ్ బై చెప్పి ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో లవ్వాయణం నడుపుతుంది. ఈ విషయాన్ని పలుమార్లు బాలీవుడ్ మీడియా కూడా చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ నుపుర్‌తో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేసి ఇది మీకు తెలియజేయడం గౌరవం అని పేర్కొంది.
ఇరా ఖాన్ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు ఎమ్మోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీపావళి సమయం నుండి ఇరా ఖాన్.. నుపుర్‌తో కలిసి పలు ఫొటోలు దిగడం, ఆయనతో చక్కర్లు కొట్టడం చూసి ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడిదే నిజమైంది. మరి ఇరా ఖాన్ పోస్ట్‌ని బట్టి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని , అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని మనం ఫిక్స్ అయిపోవచ్చా అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.