కావలసిన పదార్థాలు
బియ్యపు రవ్వ: ఒకటిన్నర కప్పులు, అటుకులు: ఒక కప్పు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, బేకింగ్ సోడా: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా
తయారీ విధానం
ముందుగా, అటుకులను పుల్లని పెరుగులో నానబెట్టాలి. బాగా నానిన అటుకులను మెత్తగా రుబ్బుకొని, దాంట్లో బియ్యపు రవ్వ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ పది నిమిషాలు పక్కన పెట్టాలి. గట్టిపడితే కొన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి కలిపి ప్లేట్లకి నూనెరాసి ఇడ్లీలు వేసుకోవాలి. స్పాంజిలా మృదువుగా ఉండే అటుకుల ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి.