e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News సాహసికులకు వాయుసేన పిలుపు !

సాహసికులకు వాయుసేన పిలుపు !

  • ఎయిర్‌ఫోర్స్‌ క్యాట్‌-2022

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌… ఆకాశమంత అవకాశాలు. సాహసవంతులకు, నిత్యం చాలెంజింగ్‌ కెరీర్‌ కావాలనుకునే వారికి ఎయిర్‌ఫోర్స్‌ చక్కటి వేదిక. డిగ్రీ పూర్తయిన వారికి భద్రమైన కొలువుతోపాటు మంచి జీతభత్యాలతో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌క్యాట్‌ 01/2022
వివరాలు నిపుణ పాఠకుల కోసం….

ఏఎఫ్‌ క్యాట్‌

  • ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌. ఏటా రెండుసార్లు ఈ టెస్ట్‌ ద్వారా కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పర్మనెంట్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
  • మొత్తం ఖాళీలు- 317
  • బ్రాంచీలవారీగా ఖాళీలు
  • ఏఎఫ్‌ క్యాట్‌ ఎంట్రీ
  • బ్రాంచీ: ఫ్లయింగ్‌
  • ఖాళీలు: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)- 77
  • బ్రాంచీ: గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌)
  • ఖాళీలు: ఏఈ (ఎల్‌)- పర్మనెంట్‌ కమిషన్‌ (పీసీ)- 19, ఎస్‌ఎస్‌సీ- 76
  • ఏఈ (ఎం)- పీసీ-7, ఎస్‌ఎస్‌సీ- 27.
  • బ్రాంచీ: గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌)
  • ఖాళీలు: అడ్మిన్‌- పీసీ-10, ఎస్‌ఎస్‌సీ-41, అకౌంట్స్‌ పీసీ-4,
  • ఎస్‌ఎస్‌సీ-17, లాజిస్టిక్స్‌ పీసీ-8, ఎస్‌ఎస్‌సీ-31
- Advertisement -

ఎంపిక విధానం

  • ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌) అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌కు హాజరు కావాలి.

పరీక్ష విధానం

  • మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
  • రెండు గంటల కాలవ్యవధి
  • దీనిలో జనరల్‌ అవేర్‌నెస్‌, వెర్బల్‌ ఎబిలిటీ ఇన్‌ ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, మిలిటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌.
  • ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌: దీనిలో మెకానికల్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టులు ఉంటాయి.
  • నోట్‌: ఏఎఫ్‌ క్యాట్‌, ఈకేటీ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.
  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌.
  • ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించినవారికి ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఏఎఫ్‌ఎస్‌బీ) రెండుదశల్లో వివిధ పరీక్షలు నిర్వహిస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ, వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది.
  • పరీక్ష తేదీలు: తేదీలను త్వరలో వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ట్రెయినింగ్‌

  • 2023 జనవరి నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, దుండిగల్‌ (హైదరాబాద్‌)లో శిక్షణ ఇస్తారు. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచీకి 74 వారాలు, నాన్‌ టెక్నికల్‌ బ్రాంచీకి 52 వారాల శిక్షణ ఇస్తారు.
  • పే అలవెన్స్‌లు: ఫ్లయింగ్‌ ఆఫీసర్‌- లెవల్‌ 10 కింద నెలకు రూ.56,100-1,77,500, ఎంఎస్‌పీ రూ.15,500, శిక్షణ సమయంలో రూ.56,500 స్టయిఫండ్‌ ఇస్తారు.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ

  • బ్రాంచీ: ఫ్లయింగ్‌
  • ఖాళీలు: సీడీఎస్‌ఈ ఖాళీల్లో 10 శాతం పీసీ కింద, ఏఎఫ్‌ క్యాట్‌లో 10 శాతం ఖాళీలను ఎస్‌ఎస్‌సీ కింద భర్తీ చేస్తారు.
  • నోట్‌: పీసీ అంటే పర్మనెంట్‌ కమిషన్‌, ఎస్‌ఎస్‌సీ అంటే షార్ట్‌ టర్మ్‌ కమిషన్‌.

ఎవరు అర్హులు?

  • కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్‌, బీకాంతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, ఎన్‌సీసీ-సీ సర్టిఫికెట్‌ ఉండాలి. అకౌంట్స్‌ పోస్టులు బీకాం డిగ్రీ, లాజిస్టిక్స్‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఫ్లయింగ్‌ బ్రాంచీకి 2023, జనవరి 1 నాటికి 20-24 ఏండ్ల మధ్య, గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచీకి 20-26 ఏండ్ల మధ్య ఉండాలి.
  • నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు అయి ఉండాలి.
  • 1.6 కి.మీ దూరాన్ని 10 నిమిషాల్లో పరుగెత్తాలి. వీటితోపాటు పుష్‌ అప్స్‌ తదితర పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: 2021, డిసెంబర్‌ 30
వెబ్‌సైట్‌:https://afcat.cdac.in/AFCAT/

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement